పుట:Andhrula Charitramu Part-1.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వంశకర్తయైన మల్లివర్మ త్రినేత్రపల్లవుని సహాయముతో నాక్రమించెనని పైని జెప్పబడియెనుగదా. ఇది నిజమైనను గాకపోయినను వెలనాటి చోడులకు షట్సహ ప్రదేశములోని ధనదపురము రాజధానిగనుండెను. వెలనాటి ప్రభువులలో రెండవ గొంకరాజు త్రిశతోత్తర షట్సహస్రావనీనాథుడని దాక్షారామములోని యొకశాసనమున బేర్కొనంబడియుండుటయో గాక ధనదపురమును నివాసస్థలముగ నేర్పఱుచుకొనియెనని చెప్పబడియుండెను. ఇట్లనే ప్రసిద్ధికెక్కిన త్రినయన పల్లవుని యనుగ్రహమున దమపూర్వులీ షట్సహస్రదేశమును సంపాందించిరనియును, తామును గూడ షట్సహస్రావనీనాథులమనియు, అమరావతిని బాలించినకోట వంశజులు చెప్పుకొనియుండిరి. [1] ఇంతియగాక కృష్ణా మండలములోని నూజవీడు తాలూకాలోనున్న యెనమదల గ్రామములోని యొకశాసనములో కొన్నతవాడి విషయమును షట్సహస్రదేశమును నొక్కటియే యనియు, దానికి రాజధాని ధాన్యాంకపురమనియు జెప్పబడియున్నది. ధాన్యాంకపురమనునది అమరావతియొక్క నామాంతరమైయున్నది.

కాబట్టి యెనమదల శాసనమునకును పిఠాపురము శాసనమునకు ఏకీభావము గన్పట్టుచున్నందున ధనదపురమనునది ధాన్యాంకపురముయొక్క నవీననామమని తేటపడుచున్నది. ఆంధ్రబౌద్ధుల కాలమున ధనదపురము ధాన్యాకటకమను పేరబరగు చుండెనని మనమెఱుంగుదుము. కనుక షట్సహస్రదేశమనియెడి యాయాఱువేల నాడు వెలనాడులో నంతర్భాగమైన గుంటూరు మండలమునకును అందుముఖ్యముగా గుంటూరు నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, పల్నాడు తాలూకాలకు వర్తింపగలదని చెప్పవచ్చును.


ఆఱువేలనియోగులు.

ఆంధ్రబ్రాహ్మణులలో నియోగులలో నాఱువేల నారనియెడు శాఖయొకటిగలదు. ఈశాఖవారు మహమ్మదీయ ప్రభుత్వకాలములో దొరతనము వారి కొలువులో బ్రవేశించినపుడు వీరిసంఘములో నాఱువేలకుటుంబములవారుండుటచేత వీరు తామాఱువేలవారమని చెప్పుకొనుచుచుండిరని జనప్రతీతయొ

  1. Ep. Ind. Vol.III. p. 95.