కటి వ్యాపించి యుండెను. వీరినిగూర్చి పెక్కు గాథలు చెప్పబడుచున్నవి. ఆవన్నియు వట్టికల్పనలు గాని సత్యములు గావు. ఆఱువేలనియోగులనునామము తక్కినవారివలెనె దేశభేదమునుబట్టి కలిగినదే గాని మఱియొకటి గాదు. ఈ శాఖవారి జన్మస్థానమీయాఱువేలనాడు. మొదట వీరీప్రదేశముననుండి యన్యభాగములకు బోయినపుడు వెలనాటి వారు, వేగినాటి వారు, మొదలగువారివలెనే వీరును ఆఱువేల నియోగులని పిలువంబడుచు రాగా రాగా నాడుపదము విడిచిపెట్టబడి ఆఱువేల నియోగులని మాత్రము వ్యవహరింపబడుచువచ్చిరి. మఱికొంతకాలమునకు నియోగులన్నపదముగూడ విడిచిపెట్టబడి యాఱ్వేలవారనియె పిలువంబడుచున్నారు. ఆఱ్వేలవారని యెప్పుడు ప్రారంభమైనదో అప్పటినుండి యాఱ్వేలసంఖ్యనుగూర్చి కల్పనాకథలెన్నో పేర్కొనబడుచున్నవి. వానితో మనకిప్పడు నిమిత్తములేదు. వెలనాడు నుండి వచ్చినవారు వెలనాటి వారైరి. వేగినాడు నుండి వచ్చిన వారు వేగినాటివారైరి.ములికినాడు నుండి వచ్చిన వారు ములికినాటివారయిరి. తెలుగునాడు నుండి వచ్చినవారు తెలగాణ్యులయిరి. కోసలనాడు(దక్షిణకోసలము) నుండి వచ్చిన వారుకాసలనాటి వారైరి. ఆఱువేల నాడునుండి వచ్చినవారాఱ్వేల వారయిరి. ఇట్లు తమతమనాడులనుండి పెఱనాడుల నివసింపబోయినప్పుడు వాడివారి నాడులను బేర్కొనుచువచ్చిరి. తుదకవి బ్రాహ్మణులలో శాఖాభేదములుగా బరిణమించినవి. ఈ నాడీ భేదము లొక్కమాఱుగ నేర్పడినవికావు. పూర్వకాలమునందీనాడులన్నియు నొక్క ప్రభుత్వము క్రిందివిగాక యొకచోటనున్నవి గాక యొక కాలమునందేర్పడినవిగాక వేఱ్వేఱు రాజులచే బరిపాలింపబడుచు, ఒకదానికొకటిబహుదూరమున నుండుచు, భిన్నకాలములయందేర్పడినవగుచేతను, ఆ కాలమునందు రాకపోకలు సులభసాధ్యములుగాకుండుటచేతను, ఒకనాడులోని బ్రాహ్మణులు మఱియొక నాడులోని బ్రాహ్మణులతో సంబంధములు చేసికొనుటవలన జిక్కులు పెక్కులుండుటచేత సంబంధ భాంధవ్యములు మానుకొనుచు సర్వసాధారణముగాదమతమ నాడులలోనే పిల్లల
పుట:Andhrula Charitramu Part-1.pdf/371
Jump to navigation
Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
