గా నున్నది. కొన్ని యుద్ధములయందొకవేళ విక్రమాదిత్యునికి విజయములు గలిగియుండినను కడపటివిజయము మాత్రము కులోత్తుంగ దేవునిదేయని చెప్పదగినది కాని కేవలము విక్రమాంకదేవచరిత్రములోని వాక్యముల నే విశ్వసించి భాండార్కరుగారు తమదక్షిణాపథ ప్రాచీనచరిత్రమునందు జెప్పినట్లు విక్రమాదిత్యునిదికాదు. విక్రమాంకదేవచరిత్రము విక్రమాదిత్యునివిజయములను ప్రకటించుచుండగా గళింగట్టుపారణి యను ద్రవిడకావ్యము కులోత్తుంగుని విజయములను బ్రకటించుచున్నది.
కులోత్తుంగ దేవునివిజయములు.
ఇతడు రాజ్యాధిపత్యము వహించిన రెండవ సంవత్సరమున ననగా క్రీ.శ.1071-72వ సంవత్సరమున వ్రాయించిన శాసనములు పులియారునాడు (ఎళుమూరునాడు (ఎళంబూరు-Egmore)సాలయనూరునాడు మొదలగునవి స్వాధీనములో నున్నటుల జాటి చెప్పుచున్నవి. ఇయ్యవి యిప్పటి చెంగలుపట్టు, ఉత్తరార్కాడు మండలములోనివిగా నున్నవి. [1] ఇతడు కేరళపాండ్యకుంతలదేశములను జయించినట్టు వీరచోడుని చెల్లూరుశాసనముంబట్టి దెలియుచున్నది. [2] కళింగట్టుపారణి యనుద్రావిడకావ్యమునందు కుంతలము నేలుబిరుదరాజును (విక్రమాదిత్యుని) జయించినట్టుగూడ చెప్పబడినది. [3] వీని పదునొకండవ పరిపాలన సంవత్సరములోని యొక శాసనమీతడు విక్రమాదిత్యుని కోలారు మండలములోని నాంగిలినుండి మానలూరు మార్గముగా తుంగభద్రానది వఱకు దఱిమినట్లును, గంగమండలమును సింగాణమును ( మైసూరు దేశములోనివి) జయించినట్లునుజాటుచున్నది. తరువాత నొక శాసనము మూనలూరునకు బదులుగా ఆలట్టిని సింగాణమునకు బదులుగా కొంకణమును బేర్కొనుచున్నది. మఱియొకశాసనము విక్రమాదిత్యుడును వానిసోదరుడయిన జయసింహుడును కులో