పుట:Andhrula Charitramu Part-1.pdf/353

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


త్తుంగుని ప్రతాపముముంగట నిలువంజాలక పశ్చిమసముద్రమును శరణుచొచ్చిరని చెప్పబడినది. విక్రమాదిత్యజయసింహులతోడి పోరాటములో నవిలై యను ప్రదేశమున శూరులయిన దండనాయకులచే సంరక్షింపబడుచుండిన వేయియేనుగులను ముట్టడించి పట్టుకొనియెనని చాటిచెప్పుచున్నది. నవిలైయనునది మైసూరు రాజ్యములోనినవిలెనాడులోనిది. వీని పదునాలుగవ పరిపాలన సంవత్సరములోని యొకశాసనమీతడు పాండ్యులనైదుగురిని జయించుట మాత్రమేగాక మన్నారుజలసంధి, పొడియిల్ కొండ, కన్యాకుమారి, కొట్టారు మొదలగు ప్రదేశములను వశపఱచికొనియెనని చెప్పబడియెను. పాండ్యదేశమునకు హద్దులేర్పాటు గావించెను. పాండ్యదేశముతో గూడ కుడమలైనాడును (మలబారులోని పశ్చిమభాగము) గూడ జయించెను. ఇప్పటి నాయరులపూర్వికులయిన యాదేశములోని రణశూరులు తమస్వాతంత్ర్య సంరక్షణనం దందఱును బ్రాణములర్పించుకొని నాశముజెందిరి. చేరరాజుయొక్క నావికాసైన్యమును నోడలును రెండుమాఱులు నాశము గావించెను. [1] నయిరువది యాఱవ పరిపాలనసంవత్సరమునకు లోపలనే అనగా 1065-1069వ సంవత్సరమున గళింగమును జయించెను. [2] ఇదియె వివరముగా కళింగట్టుపారణి యనుగ్రంథమున వర్ణింపబడినది.

కులోత్తుంగ చోడదేవునిబిరుదునామములు.

ఈ రెండవ రాజేంద్ర చోడదేవునకు రాజకేసరివర్మ యను బిరుదు నామముగలదు. చెల్లూరు పిఠాపురము శాసనములో నీతనికి రాజనారాయణ బిరుదముండినటుల జెప్పబడియుండెను.[3] ఈ బిరుదు నామమునుబట్టియే గోదావరిమండలములోనిదగు భీమవరములోని యొకదేవాలయమునకు రాజనారాయణ

  1. Ind. Ant. Vol XXII, p. 142
  2. Ep.,Ind. Vol V, Appendix, p. 5l, No. 358, add, p. 52,No. 363.
  3. Ep Ind Vol I , No. 39, Verse 12, and Ep. Ind.Vol V. No. 10 Verse11