పుట:Andhrula Charitramu Part-1.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వివిధతర్కవిగాహిత సమస్తశాస్త్ర సాగరగరీయప్రతిభులయిన తార్కికులును నాదిగాగల్గు విద్వజ్జనంబులు పరివేష్ఠించి కొలువ నిరంతరము విద్యావిలాసగోష్ఠి సుఖోపవిష్ఠుండయి యిష్టకథావినోదంబుల బ్రొద్దుపుచ్చువాడును నైనయాంధ్రభారతకృతిపతితలకు దలయుందోకయులేని చిత్రాంగిసారంగధరులకథను కనకాంబచరిత్రమును ముడివెట్టియు, నన్నయభట్టుతలకు నతండనూయాపిశాచగ్రస్తుండని దెలుపు నసందర్భము లయిన గాథలను ముడివెట్టియు జరిత్రజ్ఞానములవలేశమును లేక కూపస్థమండూకములవలె నున్న కుకవిరాజమండలము పామరప్రపంచమును పెడదారిని బట్టింటుట కృతఘ్నాపవాదములే కారణములుగదా.

కులొత్తుంగ చోళదేవుడు.

(క్రీ.,శ. 1070 మొదలుకొని 1118వఱకు) రాజనరేంద్రుని కాలమున నాంధ్రదేశమునకుం గలిగిన స్వాస్థ్యమునకు రాజనరేంద్రుని మరణానంతరము భంగము గలిగినది. రాజనరేంద్రునికి బిమ్మట నాతని కుమారుడగు కులోత్తుంగ చోళదేవుడు సింహసనమెక్క వలసియుండ గులోత్తుంగ చోళదేవునకు బదులుగా విమలాదిత్యుని రెండవకుమారుడును రాజనరేంద్రుని తమ్ముడు నైన విజయాదిత్యుడు సింహాసన మాక్రమించుకొని యాంధ్రదేశమును బాలించునట్లు గానంబడుచున్నది. విమలాదిత్యుని కుమారుడగు రాజరాజనరేంద్రునకు రాజేంద్రచోడునికూతురగు అమ్మంగదేవికి జనించినవాడు రాజేంద్రచోడదేవుడు. విమలాదిత్యుడు రాజరాజచోడునికూతురగు కూండవాదేవిని వివాహమాడి యామెయందుగన్న తనకుమారునకు రాజరాజని తనమామపేరు పెట్టెను. ఈ రాజేంద్రచోడుడు మాతామహుని రాజ్యమగు చోడరాజ్యమును వశపఱచుకొన్న తరువాత కులోత్తుంగ చోళదేవుడను నామమును వహించెను. రాజరాజనరేంద్రుని కుమారుడగు రాజేంద్రచోడుడు యువరాజుగనుండినపుడె