యుత్తరదేశములపై దండెత్తిపోయి మాధ్యమాగాణములలోని వాయిరాగరమను ప్రదేశమును ననేక గజయూధములను ముట్టడించి వశపఱచుకొని సింధువంశపురాజగు ధారవర్షునిచే బరిపాలింపబడుచుండిన చక్రకోట్యమును ముట్టడించివశపఱచుకొనియెను.[1] ఈ దండయాత్ర యెందుకొఱకు సంభవించెనో దెలియరాదు. భారతకృతపతి యైనరాజరాజవిష్ణువర్ధనునిమరణానంతరము చోడదేశమును బాలించు చుండిన వీరరాజేంద్రునిసహాయముతో రాజరాజవిష్ణువర్ధనుని తమ్ముడగు విజయాదిత్యుడు రాజరాజవిష్ణువర్ధనుని(రాజరాజనరేంద్రుడు) కుమారు డగు రాజేంద్రచోడుని వెడలగొట్టి వేంగిరాజ్యమును దానేయాక్రమించుకొని పరిపాలింప నారంభించెను. వీని పరిపాలనకాలమున నాహమల్లని రెండవకుమారు డుగునీయాఱవవిక్రమాదిత్యుడును పశ్చిమచాళుక్య రాజు వేగిదేశముపై దండెత్తి వచ్చి కలవరపెట్టనారంభించెను. రాష్ట్రకూటులప్రభయడంగి పశ్చిమచాళుక్యరాజ్యము పునరుద్ధారణ కాబడినతరువాత నాహవమల్లుని రెండవకుమారు డగు నీయాఱవవిక్రమాదిత్యుడు నిర్వక్రపరాక్రముండై విజృంభించి దిగ్విజయములు సలుపుచున్న వాడగటంజేసి యెట్లయిన నాంధ్రదేశమును మ్రింగివేయవలెనని దండయాత్ర నెడలి వచ్చెను. ఈ యాఱవవిక్రమాదిత్యుడు బహుపరాక్రమువంతుడగుటచేత వీని నెదుర్కొనుపాటిరణశూరుడు దక్షిణహిందూస్థానమునందు గానరాకుండెను. చోడరాజగు వీరరాజేంద్రుడు వీని దోర్దర్పమునకు భయపడి విక్రమాదిత్యునికి దనకూతురనిచ్చి వివాహముజేసి వానితో మైత్రి నెఱపవలసినవాడయ్యెను. అట్టి ప్రబలశత్రవుదేశముపై దండెత్తివచ్చినపడుపౌరుషశాలియైన రణశూరడెట్లూరుకుండగలడు? విజయాదిత్యుడసమర్ధుడై యేమియు జేయజాలకుండుట జూచి రాజరాజనరేంద్రునితనయుండగు రాజేంద్ర చోడుడు ధైర్యసాహసములు ముప్పిరిగొన స్వసైన్యముతో శత్రువుని మార్కొని తిరిగి చూడకుండ
- ↑ Ep- Ind. Vol IX, p. 178;No.538, Public,28thJuly 1909 para 66.చక్రకోట్యము (చక్రకోట) బస్తరురాజ్యములోనిది.