పుట:Andhrula Charitramu Part-1.pdf/347

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోరుమల్లిశాసనము.

రాజరాజవిష్ణువర్ధనుమహీపాలుడు సంస్కృతకర్ణాటపైశాచికాంధ్రభాషాకవిరాజశేఖరుండగు నారాయణభట్టునకు నందమపూడి గ్రామమును మహాకవి యగు పావులూరి మల్లనామాత్యునకు నవఖండవాడ యనుగ్రామమును దానముచేసినట్లుగా నందమపూడి శాసనమువలనను, పావులూరి మల్లనకవివరచితమైన గణితశాస్త్రమువలనను దెలిసికొంటిమిగదా. ఇట్లేయాపస్తంబసూత్రుడును భారద్వాజగోత్రుడు నగు చీదమార్యుడను బ్రాహ్మణునకు కోరుమల్లినామగ్రామమును చంద్రగ్రహణ పుణ్యకాలమున దానముచేసి యుండెను. [1] ఇట్టి కవులను బండితులను నాదరించి యగ్రహారములు మొదలగునవి యిచ్చి భాషాపోషణము మొదలగు సత్కార్యములాచరించిన వాడగుటచేత నన్నయభట్టు తనభారతమునందు రాజనరేంద్రుని

"సీ. నిజమహామండలప్రజఁ బ్రీతిఁ బెంచుచు
బరమండలములధరణిపతుల
నదిమి కప్పంబుల ముదముతోఁ గొనుచును
బలిమి నీయనిభూమివలయపతుల
ను క్కడగించుచు దిక్కులఁ దనయాజ్ఞ
నెలిగించుచును విప్రకులము నెల్లఁ
బ్రోచుచు శరణన్నఁ గాచుచుభీతుల
నగ్రజన్ములకు ననుగ్రహమున
జారుతరమహాగ్రహారంబు లిచ్చుచు
దేవభోగముల మహావిభూతిఁ
దనరజేయు చిత్లు మనుమార్గుఁడగువిష్ణు
వర్ధనుండు వంశవర్ధనుండు."

  1. lnd. Aut. Vol XIX,p.129; ఈ కోరుమల్లి కోదావరిమండలములో రామచంద్రాపురముతాలూకాలో నున్నది.