పుట:Andhrula Charitramu Part-1.pdf/343

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ద్ధనిరూపితార్థమేర్పడ
దెనుగున రచియుంపు మధికదీయుక్తిమెయిన్."

అని మహాభారతమును దెనుగున రచియింపుమని నన్నపార్యునిగోరెను. హిమకరపూరు భరతేశకురు ప్రభుపాండు భూపతులవంశమునందు దాను జనించెనని తనపూర్వులును తన్నాశ్రయించుకొనియుండు పురోహితులు మొదలగువారును జెప్పెడుగాథలను విశ్వసించినవాడగుటచేతగూడతనపూర్వులయిన పాండవులచరిత్రమును వినంగుతూహల మాతనికి స్వాభావికమునగా నగ్గలమై యుండవచ్చును. కావున నట్లు మహారాజాధిరాజుచే బ్రేరేపింపబడి విద్వత్కవిశిరోమణియు బుద్ధియందు బృహస్పతియునగు నన్నయార్యుడు వాజ్మయ దురంధురుండయిన నారాయణభట్టు సహాయముతో మహాభారతములోని మొదటి రెండుపర్వములను మూడవపర్వములోని కొంతభాగమును మాత్రము దెలిగించెను.

నన్నయభట్టాది కవిగాడు. ఆంధ్రభారతము ప్రథమాంధ్రకావ్యముగాదు.

నన్నయభట్టునకు బూర్వము గవులెవ్వరును, ఆంధ్రభారతమునకు బూర్వమున నాంధ్రగ్రంథము లెవ్వియును వినంబడకుండుటయు, గానరాకుండుటయుంజేసి నన్నయభట్టే ప్రథమాంధ్రకవియనియు, ఆంధ్రభారతమె ప్రథమాంధ్ర గ్రంథమనియు గొందఱి యభిప్రాయమై యున్నదిగాని వారివాదమును మేమువిశ్వసింపజాలకున్నారము. ఏతద్విషయమై గావింపబడిన చర్చలను సంపూర్ణముగా వినియుంటిమి. తత్పక్షమున వ్రాయంబడిన నన్నయ భట్టారకచరిత్రమాదిగాగల గ్రంథములను ఆ గ్రంథములలోని యుక్తులను, మేము సాంతముగ జదివియుంటిమి. అవియేవియును మా విశ్వాసమును మరలింపజాలకున్నవి. మహాభారతమును దెనుగున రచింపుమని రాజరాజనరేంద్రుడు నన్నయభట్టును గోరునప్పటికే నన్నయ ఉభయ భాషాకావ్యారచనాభిశోభితుండని రాజనరేంద్రునిచే బేర్కొనంబడియెనని నన్నయ్య మహాభారతమునందు