నానాపురాణవిజ్ఞాననిరంతుండును, ఆపస్తంబసూత్రుండును, ముద్గలగోత్రజాతుండును, నద్వినుతావజాతచరితుండును, లోకజ్ఞుండును, ఉభయభాషాకావ్యరచవాభిశోభితుండును, సత్ప్రతిభాభియోగ్యుండును, మత్యమరాధిపాచార్యుండును, సుజనుండును నగునన్నపార్యునింజూచి యిట్లయనియెను.
"చ. విమలమతిన్ బురాణములు వింటి ననేకము లర్థధర్మశా
స్త్రముల తెఱంగెఱింగితి నుదాత్రరసాన్విత కావ్యనాటక
క్రమములు పెక్కుచూచితి జగత్పరిపూజ్యములైనయీశ్వరా
గమములయందునిల్పితి బ్రకాశముగా హృదయంబు భక్తితోన్.
మ. ఇవి యేనున్ సతతంబునాయెడగరంభిష్టంబులై యుండుబా
యవు భూదేవకులాభి తర్పణమహీయ ప్రీతియున్ భారత
శ్రవణాసక్తియు బార్వతీ పతిపదాబ్జధ్యానపూజా మహో
త్సవమున్ సంతతిదానశీలతయు శశ్వత్సాధు సాంగత్యమున్
మఱియు నదియునుంగాక.
చ. హిమకరుదొట్టి పూరభరతేశకురుప్రభుపాండుభూపతుల్
క్రమమున వంశకర్తలనగా నుహినొప్పిన యస్మదీయవం
శమున బ్రసిద్ధులై విమలసద్గుణ శోభితులైన పాండవో
త్తముల చరిత్రనాకు సతతంబువినంగనభీష్టమెంతయున్"
ఈపైని జెప్పబడినపద్యములలోని భావములనుబట్టి శైవమతాభిమానము గలవాడనియు అనవరతంబును శ్రీమహాభారతమునందలి యభిప్రాయమును విననభిలాషగలవాడనియు స్పష్టముగ దేటపడుచున్నది. కనుకనే రాజమహేంద్రుడు.
" జననుత కృష్ణద్వైపాయనముని వృషభాభి హితమహాభారత బ