పుట:Andhrula Charitramu Part-1.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డు సింహాసనమెక్కిన తరువాతనె జరిగినదనుట మాత్రము వాస్తవమనుటకు సందియములేదు. రాజనరేంద్రుని పరిపాలనకాల మీయాంధ్రదేశమునకు మిక్కిలి మంచికాలమని చెప్పుటకు సంశయింపబనిలేదు. ఇంతకు బూర్వమనేక పర్యాయములు రాజోపద్రవములచే బీడింపబడు చుండినయీయాంధ్రదేశ మీసరగండ భైరవుండగు రాజరాజనరేంద్రుని కాలములో స్వస్థతనుగాంచి దివ్యసుఖములను గాంచెను. ఇతడింత దీర్ఘకాలమునిష్కంటకముగా దేశపాలనము జేయుటకు గారణము బలాఢ్యులయినచోడులయొక్క సహాయమేగాని యన్యముగాదనియు, వారిసహాయములేని యెడల నిట్టిస్వాస్త్యము గలుగనేరదనియు గొందఱు తలంపవచ్చునుగాని పరాక్రమంబున రాజనరేంద్రుడు పూర్వరాజులకెంతమాత్రమును దీసిపోయినవాడుకాడు.

రాజనరేంద్రుని బిరుదునామములు.

సత్యాశ్రయకులశేఖరుడు, సర్వలోకాశ్రయుడు, రాజకంఠీరవుడు, త్రిభుననాంకుశుడు, సమస్తభువనాశ్రయుడు, బిరుదాంకభీమడు, రాజమహేంద్రుడు, రాజమార్తాండుడు,పరగండభైరవుడు, రాజపరమేశ్వరుడు మొదలగు బిరుదునామములెన్నో వహించి రాజరాజనరేంద్రుడు సుప్రఖ్యాతి గాంచినవాడని నన్నయభట్టనేకబిరుదునామములతో నభివర్ణించుటయేగాక

"ఉ.రాజకులైకభూషణుడు రాజమనోహరు డన్యరాజతే
జోజయశాలి శౌర్యుడు విశుద్ధయశశ్చరదిందుచంద్రికా
రాజితసర్వలోకుడపరాజిత భూరిభుజాకృపాణధా
రాజలశాంతశాత్రవపరాగుడు రాజమహేంద్రుడున్నతిన్.

అనియు
                     వసంతతిలకము.
"వీరావతారనుకవిస్తుతనిత్యధర్మ
ప్రారంభశిష్టపరిపాలనశక్తరాజా