పుట:Andhrula Charitramu Part-1.pdf/337

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కాలేరగ్రహారమును దాక్షారామ పీఠికాపుర సత్రములను జరుపుటకయి ముద్గలగోత్రుడును పోతనార్యుని పుత్రుడునయిన మేడమార్యుడను బ్రాహ్మణునకిచ్చినట్టియు దానశాసనములనుబట్టి రాజరాజనరేంద్రుని కుమారుడయిన కులోత్తుంగ చోడదేవుడు శాలివాహనశకము 986వ సంవత్సరమనగా క్రీస్తుశకము 1063వ సంవత్సరమున రాజ్యమునకు వచ్చినట్టు చెప్పబడియున్నదిగనుక రాజరాజనరేంద్రుడు1022వ సంవత్సరము మొదలుకొని 1063వసంవత్సరమువఱకును40సంవత్సరములు నిరాతంకముగా రాజ్యపరిపాలనముచేసినట్లు సిద్ధాంతమగుచున్నది.[1]

విమలాదిత్యుడు రాజేంద్రచోడునిచే జెఱగొని పోబడి తంజాపురియందుండిన కాలమున కూండవాంబాదేవిని వివాహమాడినది వాస్తవమగునేని రాజనరేంద్రుడు 1011వ సంవత్సరమునకును నడుమజనించి యుండవలయును గావున సింహాసనమెక్కునప్పటికి బదిపండ్రెండుసంవత్సరముల బాలుడైయుండవలయును. అటుగాక 999 దవ సంవత్సరమన విమలాదిత్యునియన్న యగుశక్తివర్మ సింహసమునుకు వచ్చినతరువాత కూండవాంబను విమలాదిత్యుడు వివాహమాడి పుత్రజననమును గాంచినను రాజనరేంద్రుడు సింహసనమెక్కునప్పటికి నిరువదియేండ్లలోపలి వయస్సుగలవాడేయైయుండును. శాసనములను జక్కగా బరిశోధించి చూచిన పక్షమున మొదటి వృత్తాంతమె నమ్మదగియున్నది. ఈరాజరాజనరేంద్రుడు సింహాసనమెక్కిన తరువాత కొండ రాజేంద్రుని కూతురగు అమ్మంగదేవిని వివాహమాడెను. ఈవివాహమెప్పుడు జరిగినదియు దెలియరాదుగాని రాజనరేంద్రు

  1.  " శ్లో. తత్తనయోనయశాలీ జయలక్ష్మీధామ రాజరాజనరేంద్ర
    చత్వారింశతి (మ) బ్దానేకంచ పునర్మహీమపాలయదఖిలామ్"

    " తదనుజో విమలాదిత్యస్తప్త, తత్సుత్రో రాజరాజదేవ ఏకచత్వారింశత్. తత్పుత్ర శ్రీకులోత్తుంగ చేడదేవ ఏకోనపంచాశత్.... రాజ్యం ప్రశానతి"