పుట:Andhrula Charitramu Part-1.pdf/333

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చేత డాక్టరు హల్ ట్జు మొదలగు వారు రాజేంద్రచోడుడు విమలాదిత్యుని నోడించి దక్షిణదేశమనకు జెఱగొనిపోయె ననియు, అచ్చటనున్న కాలమున జోడరాజు కుండనాంబా దేవిని విమలాదిత్యునికిచ్చి వివాహముచేసి వేంగిదేశమును బరిపాలించుటకు మరల బంపిరనియు, విమలాదిత్యుడు స్వదేశమునకు వచ్చి 1015 దవ సంవత్సరమునుండి నిరంకుశముగా దేశమును బరిపాలించెననియును విమలాదిత్యుడు దక్షిణదేశమున నున్న కాలమును విడిచి పూర్వచాళుక్యుల శాసనములు వానిరాజ్యపాలనకాలము 1015వ సంవత్సరమునుండి మాత్రమె పరిగణించి యేడుసంవత్సరములని వక్కాణించినవనియుసమన్వయము చేయుచున్నారు గాని తక్కిన విషయములను బాటింపుచుండలేదు. విమలాదిత్యుని మామయగు రాజరాజ చోడుడు 985దవ సంవత్సరమున సింహాసనమునకు వచ్చెను. తన పదునాలుగవ పరిపాలన సంవత్సరమున ననగా 999దవ సంవత్సరమున వేంగిదేశముపై దండెత్తివచ్చి జయించెనని వానిశాసనములే దెలుపుచున్నవి. శక్తివర్మ 999 దవ సంవత్సరమునసింహాసనమెక్కినట్లు చాళుక్యుల శాసనములు దెలుపుచున్నవి. అదివఱ కరాజకముగ నుండిన వేంగి దేశమునందలి కలహముల నడంచి రాజరాజు శక్తివర్మను బట్టాభిషిక్తుని గావించెనని సమన్వయించిరి. విమలాదిత్యుడు 1011వ సంవత్సరమున సింహాసనమునకువచ్చినట్లు రణస్థిపూడిశాసనము చాటుచున్నది. 1014వ సంవత్సరమున విమలాదిత్యుడత్తవారింట విందులు గుడుచుచుండెను. 1011 వ సంవత్సరమునకును 1014 ‌ ‌వ సంవత్సరమునకును నడుమ రాజేంద్రచోడునిచే నోడింపబడి చెఱగొనిపోబడుటయు నచట కుండవాంబాదేవిని వివాహమాడుటయు, పంచనాదేశ్వరసామికి విమలాదిత్యుడు దానశాసనము వ్రాయించుటయు జరిగియుండెనని చెప్పుదురు. మంచిది. విమలాదిత్యుని కుమారుడయిన రాజరాజు 1022వ సంవత్సరమున సింహాసనమెక్కినట్లు రాజరాజనరేంద్రుని కోరుమల్లి నందమపూడి శాసనములు విస్పష్టముగా వెల్లడించుచున్నవి, అట్లయినచే రాజనరేంద్రుడు సింహాసన మధిష్టించునప్పటికి పదేండ్లకంటె నెక్కువవయస్సుండదని నిస్సంశయముగా జెప్పవచ్చును. రాజేంద్ర