పుట:Andhrula Charitramu Part-1.pdf/334

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చోడుడు విమలాదిత్యుని జయింపకపూర్వమే కుండవాంబను విమలాదిత్యునికిచ్చి వివాహము చేసియుండినయెడల రాజేంద్రచోడుడు విమలాదిత్యునితో బోరాడి యోడించి చెఱగొని పోవుట కంతనిరోధ కారణమేమి యుండగలదు? రాజరాజనరేంద్రుడు సింహాసనమునకు వచ్చునప్పటికంతబాలుడని యెచ్చటనువర్ణింపబడియుండలేదు. ఇయ్యది విచారణీయమైన విషయము. విమలాదిత్యుడు1011వ సంవత్సరము మొదలుకొని 1022వ సంవత్సరము వఱకు బదునొకండు సంవత్సరములు పరిపాలనము చేసెను. విమలాదిత్యునకు బిరుదాంక భీముడనియు, త్రిభువనాంకుశుడనియు, భూపమహేంద్రుడనియు బిరుదునామములుగలవు. విమలాదిత్యుడు ప్రభుత్వము చేయుకాలమునందే తనకుమారునకు రాజ్యపదవి నిలుచునట్లు కట్టుదిట్టములు గావించి విశ్వాసపాత్రులయిన మంత్రుల మొదలగువారికి గ్రామాదులనొసంగి తనయనంతరముగూడ తనపట్టున విశ్వాసముగలిగి తనకుమారుని పక్షమున నిలిచియుండునట్లు చేసికొనియెను. ప్రతాపశాలియైన నృపకాముడు దండనాయకుడుగ నుండెను. వజ్జియు యను నియోగి ప్రధానమంత్రిగనుండి అమాత్య శిఖామణి యని పేరుగాంచెను. మిక్కిలి ప్రతాపవంతుడును బలశాలియునైన కుడ్యవర్మ వీనికిలోబడిన సామంతుడుగనుండి వీని మిత్రవర్గములో జేరియుండి వెలనాడున కధీశ్వరుడుగ నుండెను.

విమలాదిత్యునిమంత్రి.

విమలాదిత్యునిమంత్రియగు వజ్జియ ప్రెగ్గడ రణస్థిపూడి శాసనమున విశేషముగా నభినందింపబడియుండెను. ఇతడు కారమచేడు గ్రామనివాసియు [1] కౌండిన్య గోత్రుడునైన బ్రాహ్మణుడుగానుండెను. ఇతడు పరిశుద్ధమైన వాక్కును, పవిత్రమైన వర్తనమును గలిగి బ్రాహ్మణకులమునకు భాస్కరునివలె నున్నవాడని గొనియాడబడియుండెను. ఈవజ్జియ ప్రెగ్గడ అమాత్యశిఖామణియనియు, బుధనజ్రప్రకారడనియు, సౌజన్యరత్నాకరుడనియు

  1. కారించేడు గ్రామము గుంటూరు మండలమున బాపట్లకు బడమట9 మైళ్లదూరమున నున్నది.