పుట:Andhrula Charitramu Part-1.pdf/332

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


శాసనమని దెలుపుట సాహసకార్యమైనను మఱియొక హేతువుచేత నయ్యది విమలాదిత్యునిదే యై యుండవచ్చునని సంశయము కలుగుచున్నది. గంజాము మండలములోని మహేంద్రగిరి మీద రెండుశాసనములు రాజేంద్రచోడుడు విమలాదిత్యుని నోడించి యాపర్వతముమీద జయస్తంభము నెలకొల్పెనని తెలుపుచున్నవి. [1] అయినను రాజేంద్రచోడుని ద్రావిడశాసనములలో నెచ్చటను నిట్టివిషయమును దెల్పియుండక బ్రదికియున్న కాలమున రాజేంద్రచోడుడు యువరాజుగనుండి యీ దండయాత్రను జరిపి యుండును గావున దనశాసనములలో నతడీ వృత్తాంతమును బేర్కొనియుండక పోవచ్చునని కొందఱు తలంచుచున్నారు. ఇక్కడ నొక ముఖ్యాంశమును చదువరులు జ్ఞప్తియందుంచుకొనవలయును. చోడచక్రవర్తియగు రాజరాజ రాజకేసరివర్మకూతురును రాజేంద్రచోడుని గారాలుచెల్లెలునగు కుండవాంబాదేవి విమలాదిత్యునకు వివాహముచేయబడియుండెను.[2] ఈ వివాహమెప్పడు జరిగినదో తెలియరాదు. ఇంకొక విశేషము గన్పట్టుచున్నది. తంజాపురమునకు సమీపమునందున్న తిరువైయారు గ్రామములోని పంచనాదేశ్వర దేవాలయములో రాజరాజ రాజకేసరివర్మ 29దవ పరిపాలన సంవత్సరమున విష్ణువర్ధన విమలాదిత్యునిచే నొక దానశాసనము వ్రాయించబడియుండెను.

రాజరాజచోడుడు క్రీస్తుశకము 985దవ సంవత్సరమున సింహాసనమెక్కినవాడు గావున విమలాదిత్యుని తిరువైయారు శాసనము 1013లేక 1014వ సంవత్సరమున లిఖింపబడియుండును. అనగా నా కాలమున విమలాదిత్యుడు తంజాపురి యం దత్తవారింటనుండి యుండవలయును. మహేంద్రగిరిశాసనములవలన బావమరిదియగు రాజేంద్రచోడునిచే నోడింపబడినట్లుండుటయు, తిరవైయారు శాసనమువలన విమలాదిత్యుడు తంజాపురమునందుండి పంచనాదేశ్వర స్వామికి దానము సలిపి నట్లుండుటయు, గన్పట్టుచుండుట[3]

  1. No 396 and 397 of 1896
  2. South Ind. Ins. VoL III, p. 126
  3. No215 of 1894.