మొదటి చాళుక్య భీమవిష్ణువర్ధనుడు.
ఇతడు గణక విజయాదిత్యుని సోదరుడగు యువరాజ విక్రమాదిత్యుని కుమారుడు. తనపెద్దతండ్రియైన విజయాదిత్యుని పిమ్మట రాజ్యమునకు వచ్చెను. గణక విజయాదిత్యుని మరణానంతరము రాష్ట్రకూటరాజయిన రెండవకృష్ణుడు పూర్వవైరమును మనస్సులో బెట్టుకొని యున్నవాడుగాన వేంగిదేశముపై దండెత్తివచ్చి దేశమాక్రమించుకొనియెను. అప్పుడీ చాళుక్యభీముడు కృష్ణునితో యుద్ధము చేసి రాష్ట్రకూటులనుజయించి దేశమునండి తఱిమివేసి దేశమునంతయు స్వాధీనపఱచుకొని నిశ్చింతగా 888మొదలుకొని 917వఱకు ముప్పది సంవత్సరములు రాజ్యపరిపాలనము గావించెను.[1] వీనికిని కృష్ణునకును జరిగిన యుద్ధమునందు వీనిసవతితో బుట్టువు కుమారుడగుమహాకాలుడనువాడు సైన్యాధిపతియై సైన్యముల నడిపించి విజయముగాంచెను. తన రాజ్యమునందంతటశాంతిని గలిగించుటకై మొదటనే దాయాదుల బలములనెల్లనోడించి వారల నందఱ నడచిపట్టి కడవఱకు రాజ్యములోన శాంతిని నెలకొల్పి ప్రఖ్యాతుడయ్యెను, ఈ చాళుక్య భీమునకు విష్ణువర్ధనుడను బిరుదునామము గూడగలదు. ఈ విషయములు నూతనముగా గనిపెట్టబడిన ఖాశింకోటశాసనమువలన దెలియుచున్నవి.[2] మఱియు నీ నూతనశాసనమునందు ఎలమంచి కళింగదేశమును, దేవరాష్ట్ర విషయమును బేర్కొనబడినవి.[3] ఈ దేవరాష్ట్రమనగా నవీనమహారాష్ట్రమదేశమని విన్సెంటు స్మిత్తుగారు చెప్పినది పొరబాటు.[4] సముద్రగుప్తునిశాసనమును బట్టి నాలుగవశతాబ్దప్రారంభమునందు