పుట:Andhrula Charitramu Part-1.pdf/321

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


విశాఖపట్టణమండలములోని దేవరాష్ట్రమును కుబేరవర్మ పరిపాలించుచుండెనని తేటపడుచున్నది. ఈ చాళుక్యభీముని శాసనములో ఎలమంచికళింగదేశమనుట కర్ధమేమని కొందరకు సందియముకలుగవచ్చును. మూడు కళింగము లుండుట చేత ఎలమంచి ముఖ్యపట్టణముగా గల కళింగమని సులభముగా గ్రహించుట కై యెలమంచికళింగదేశమని వ్రాయబడియుండునుగాని యంతకన్న మఱేమియు గారణముండబోదు. ఈ యెలమంచి అనివారితకోకిలవర్మ మహారాజునకు రాజధానిగ నుండెనని యింతకు బూర్వము దెలిపియుంటిమి. మఱియు నీశాసనము నొందొక్క విశేషము గలదు. మాలతీమాధవములోని భరతవాక్యమును దెలుపుశ్లోకము శాసనములోని ధ్యానశ్లోకములలో నొకటిగా లిఖింపబడియుండుటచేత భవభూతి మహాకవి యీ మొదటి చాళుక్యభీమవిష్ణువర్ధనునకు బూర్వమున నున్నాడని స్పష్టముగ బోధపడుచున్నది.

కొల్లభిగండభాస్కర విజయాదిత్యుడు.

( 618)

చాళుక్యభీమ విష్ణువర్ధనునకు బిమ్మట సింహాసన మధిష్ఠించినవాడు గాని జ్యైష్ఠపుత్రుడగు విజయాదిత్యడను వాడు, విజయాదిత్యనామధారులయిన పూర్వచాళుక్యరాజులలో నితడు నాలుగవవాడు. కొల్లభిగండ భాస్కరుడను బిరుదాభిదానమును వహించినవాడు. ఇతడు కళింగదేశమును జయించి త్రికళింగాటవులతో గూడ వేంగిమండలమును నాఱుమాసములు మాత్రమే పరిపాలనము చేసి దేహయాత్ర ముగించినవాడు. పట్టవర్ధకవంశములోని కాలకంపుని యన్వయమున జనించిన సోమాదిత్యుని పౌత్రుడును, కుంతాదిత్యుడను నామాంతర ప్రసిద్ధుడును నగు భండనాదిత్యుడు వీనికి మంత్రిగను సైన్యాధిపతిగను నుండెను.

అమ్మరాజ విష్ణువర్ధనుడు.

(క్రీ,శ.918 మొదలుకొని 924)

ఇతడు నాలవ విజయాదిత్యుని పెద్దకొడుకు. విష్ణువర్ధన నామమును వహించినవారిలో నీత డాఱవవాడుగ గొందఱు వ్రాసియున్నారు గాని