పుట:Andhrula Charitramu Part-1.pdf/310

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


బు(?)ధవానరంబునకు సరియైన 664వసంవత్సరము మార్చి 13వతేదీని ఎఱ్ఱయకొడుకు వినాయకునిచే వ్రాయబడినది.[1] మొదటిశాసనము గృద్రాహారవిషయములోని (గుడివాడసీమ) పల్లివాడప్రజలకు నాజ్ఞ చేయబడినదిగనున్నది. ఈశాసనములోని విషయవివరము గానరాదు.[2]

మంగియువరాజు.

(క్రీ.శ. 672మొదలు 696వఱకు)

ఈ మంగియువరాజు రెండవవిష్ణువర్ధనుని కుమారుడు. ఇతడు 672వసంవత్సరము మొదలుకొని 676 వ సంవత్సరమువఱకును, ఇరువదియైదు సంవత్సరములు పరిపాలనముచేసెను. వీనికి సర్వలోకాశ్రయుడనియు, విజయసిద్ధియనియు బిరుదునామములుగలవు. వీనిపేరుతో బ్రకటింపబడిన శాసనములు మూడు గాన్పించుచున్నవి. అందొకటి కర్మరాష్ట్రములో నూతులపఱ్ఱు గ్రామములోని కొన్ని భూములను బ్రాహ్మణులకు దానముచేయబడియెనని తెలుపునదియై యున్నది. నిస్సారామ్జీ దూతకుడని తెలుపంబడియెను. ఈశాసనము మంగియువరాజుపాలనము యొక్క యిరువదవ సంవత్సరమున నుత్తరాయణ సంక్రాంతి పుణ్యకాలమున దానముచేయబడినట్లుగ గూడ దెలుపుచున్నది.[3] గుంటూరుమండలములో వంగవోలు తాలూకాలోని చెందలూరు శాసనముగూడ మంగియువరాజు నామమును పేర్కొనుచున్నది. కమ్మరాష్ట్రములోని (కమ్మనాడు) చెందలూరు గ్రామమును బ్రాహ్మణులకు దానముచేయబడినట్లుగ జెప్పబడినది. [4] మంగియువరాజుయొక్క మఱియొకశాసనము విశాకపట్టణమండలములోని తిమ్మాపురమున నూతనముగా గానంబడినది. ఆ శాసనమింకను సంపూర్ణముగ బ్రకటింపబడియుండలేదు. [5] ఇదియును దిమిలిసీమ లోనిదిగానే గన్పట్టుచున్నది. ఈ మంగియువరాజుయొక్క చెందలూరు శా

  1. lnd, Ant,Vol Vii p. |85; ibid Vol Viii p, 320
  2. Ibid Vol Vii 191
  3. ind.Ant Vol XX.p. 105;
  4. Ep. Ind Vol III, p. 236
  5. no 574, Public, 17th July 1908, paras 12-44