సనములో పల్లవరాజగు కుమారవిష్ణుని చెందలూరుశాసనములో వలెనె రాజకీయోద్యోగీయులకు నైయోగికులని పేరుపెట్టబడియెను. మంగియువరాజు రాజ్యముగూడ విశాఖపట్టణ మండలములోని చీపురుపల్లి మొదలుకొని నెల్లూరివఱకు వ్యాపించియున్నట్లు గానంబడుచున్నది.
రెండవజయసింహుడు.
ఇతడు మంగియువరాజుయొక్క ప్రథమకళత్రమునకు జనించినవాడు. ఇతడు పదుమూడు సంవత్సరములు మాత్రము పరిపాలనము చేసెను. విప్పర్లగ్రామములోని చెఱువుగట్టుమీది యొకఱాతిపలకపై నుండుశాసనములో జయసింహుని నామము గానంబడుచున్నది గాని యయ్యది సకలలోకాశ్రయజయసింహవల్లభ మహారాజునకు సంబంధించినదిగా గన్పట్టుచున్నది. ఈ రెండవజయసింహునకు నట్టిబిరుదమున్నట్టు గానంబడదు.
కొక్కిలి విక్రమాదిత్యభట్టారకుడు.709
ఇతడు రెండవజయసింహుని సవతితమ్ముడు. మంగియువరాజునకు ద్వితీయకళత్రమువలన జనించిన ద్వితీయపుత్రుడు. రెండవజయసింహుని మరణానంతరము నక్రమముగా రాజ్యమాక్రమించుకొని తొమ్మిదినెలలు మాత్రము పరిపాలనము చేసినవాడు. వీనిశాసనమొకటి విశాఖపట్టణ మండలములో భోగపురవిషయములోని మంజేఱు గ్రామమున గానిపించినది. [1] తండ్రివహించిన విజయసిద్ధి బిరుదునామమునే యీతడును వహించెను. మంగియువరాజుకుమారుడును విష్ణువర్ధన మహారాజుయొక్క మనుమడునునగు నీ కొక్కిలి విక్ర
- ↑ కొక్కిలి విక్రమాదిత్యునియొక్కయు, వానికుమారుడు మంగియువరాజుయొక్కయు, దానశాసనములు రెండును, కోకిలివర్మ మహారాజుయొక్క దానశాసనములు రెండును విశాఖపట్టణమండలములో భీమునిపట్టణముతాలూకాలోని మంజేఱు గ్రామములో దొరకినవని మ||గురజాడ వేంకటప్పారావు పంతులుగారివలన బంపబడినవి.