పుట:Andhrula Charitramu Part-1.pdf/308

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నిప్పటికిని సర్వసిద్ధి తాలూకాయని వ్యవహరింపబడుచున్నది. [1]వీనిపేరుగల శాసనమొకటి కృష్ణామండలములోని పెదమద్దాలి గ్రామమునందు దొరకినది. ఈశాసనములో గృద్రాహార విషయములోని (గుడివాడ విషయము) పెణుకపఱ్ఱు గ్రామమును బ్రాహ్మణులకు దానముచేసినట్లు చెప్పబడినది. ఇయ్యది జయసింహుని రాజ్యకాలముయొక్క పదునెనిమిదవ సంవత్సరముననుదయపురమునుండి ప్రకటింపబడినది. [2] ఉదయపురమెక్కడిదో తెలియకున్నది. ఒకవేళ వేంగిపురమునకే యుదయపురమను పేరుకలదేమోయని సందియము కలుగుచున్నది. అట్లయినచో నితడు తండ్రివలె పిష్ఠపురము రాజధాని జేసికొనకవేంగిపురమునే రాజధానిగ జేసికొని యుండవలయును. వీనికాలములోనే హౌనుత్సాంగను చీనాయాత్రికుడీదేశమును జూడవచ్చెను. అతడీదేశమును అంతాలో (An-to-lo) అనగా ఆంధ్రమనియును, వేంగిపురమును పింకిలో (Pim-khi-lo) అనియును బేర్కొని యుండుటగూడ జయసింహుడు వేంగిపురముననుండెనని సూచించుచున్నది. అయిననింకను విచారింపవలసియున్నది. ఈ దేశమున నాకాలమున జనసంఖ్య బహుస్వల్పముగనుండెనని హౌనుత్సాంగు దెలిపియున్నాడు. ఒక ప్రక్కనుండి గాంగులు మఱియొక ప్రక్కనుండి కదంబులు నొకవైపునుండి చోడులు మఱియొక వైపునుండి రాష్ట్రకూటులు నింకొకదిక్కినుండి కళింగగాంగులు ముట్టడించుచుండగా నీదేశము వేడిమంగలమువలె వేగుచుండునపుడు జనసంఖ్య యొట్లభివృద్ధిగాంచగలదు? అయినను చాళుక్యరాజులు బహుసమర్థులును మిక్కిలి బలాఢ్యులునగుటవలన స్వరక్షణమందేమఱకయుండి రాజ్యమును గాపాడుకొనుచువచ్చిరి.

ఇంద్రభట్టారకుడు.663

ఇతడు కుబ్జవిష్ణువర్ధనుని ద్వితీయపుత్రుడు; జయసింహునితమ్మడు ఈయింద్రభట్టారకుడు పట్టాభిషిక్తుండయిన వెంటనె సామంతరాజులును శత్త్రురాజులును నేకమై వీనిని పదవీభ్రష్టునిగావింపవలయునని కుట్రచేయ నా

  1. The Vizagapataiu District Gazetteer p. 97 p. 314;
  2. Ind Ant, Vol Xiii, 137; Ibid, Vol XX,