Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మిది సంవత్సరములు రాజ్యము చేసెను. ఇతడు విషమంబులై దుస్సాధ్యములుగనుండిన దుర్గమంబులను సాధించి మనోరథసిద్ధిని గాంచినవాడు గావున విషమసిద్ధియను బిరుదమును వహించినవాడు. ఈబిరుదమును వహించినవారిలో నితడే మొదటివాడు. ఇతడు పిష్ఠపురము రాజధానిగా జేసికొని కళింగవేంగిదేశములను బరిపాలించినవాడు, వీనికి పిష్ఠపురము రాజధానిగ నున్నట్లు విశాఖపట్టణ మండలమున సర్వసిద్ధి తాలూకాలోని తిమ్మాపురశాసనమువలన బోధపడుచున్నది. [1] ఈ శాసనముయొక్క భాష సంస్కృతము. లిపి వేంగిలిపిగానున్నది. ఈ శాసనముయొక్క వైఖరి కళింగగాంగులయిన యింద్రవర్మయొక్క అచ్యుతాపురశాసనమును, దేవేంద్రవర్మయొక్క శ్రీకాకుళశాసనమును బోలియున్నది. ఈ శాసనమునందితడు సత్యాశ్రయవల్లభమహారాజుయొక్క (రెండవపులకేశి) ప్రియానుజుడనియు, కీర్తివర్మ యొక్క ప్రియసుతుడనియను, రణ విక్రముని (మొదటి పులకేశి) పౌత్రుడనియు, రణరాగుని (విజయాదిత్యుడు) ప్రపౌత్రుడనియు జెప్పబడియుండెను. ఇంతియగాక వీనిశాసనములు మఱిరెండు గానుపించుచున్నవి. అందొకటి విశాఖపట్టణ మండలములోని చీపురుపల్లి శాసనముగానున్నది. ఈ విష్ణువర్ధనుడు దిమిల సీమలోని కలవకొండ గ్రామమును తనరాజ్యకాలముయొక్క పదునెనిమిదవ సంవత్సరమున శాలివాహనశకము 555శ్రావణ శుద్ధపూర్ణిమ నాటి (క్రీస్తుశకము 672(?)వ సంవత్సరము జూలయి నెల7 వతేది) చంద్రగ్రహణకాలమున విష్ణుశర్మమాధవశర్మలను బ్రాహ్మణులకు దానముచేసెనని చెప్పబడినది. ఈ దాన శాసనము పూ (కి) లేక పక్కి (పక్షి) రాష్ట్రములోని చెఱుపూరునండి (చీపురుపల్లి) ప్రకటింపబడినది.[2] విశాఖపట్టణమండలములో సర్వసిద్ధితాలూకాలోనియెల్లమంచిలి గ్రామమునకు రెండున్నర మైళ్లదూరమున దిమిలయనుగ్రామము పూర్వము

  1. No 574, public, 17th July 1908, 60-61
  2. Ind, Ant, Vol XX., p. 15 and 69;J. A. S.B 153-8