నెల్లూరు మండలములలో13 వశతాబ్దమువఱకును గానిపించుచున్నవి. వీరిచారిత్రముల నికమీదట రాబోవు ప్రకరణముల వివరింతుము. ఆంధ్రదేశమును బాలించిన రెడ్లుకొందఱు పల్లవాదిత్యులమనియు పల్లవత్రినేత్రులమనియు, బిరుదుపేరులు వహించుటచూడ వీరలకును బల్లవులకు సంబంధము కలదని చరిత్రకారులూహించుచున్నారు. వీనింగూర్చి వారలచరిత్రమును దెలుపుసందర్భమున వివరించి వ్రాయుదుము. కాంచీపురమునుబాలించిన నందివర్మపల్లవమల్లునివంశములో జేరిన కలివర్మకు చాళుక్యుడగు రెండవతాళరాజు వెలనాటి సీమలో నొక గ్రామమును దానముచేసెనని తాళరాజు శాసనమువలన ధ్రువపడుచున్నది. ఇయ్యది నందివర్మ పల్లవమల్లుని వంశములోని యొక కుటుంబమువా రాంధ్రదేశమున స్థిరముగా నిలిచిపోయిరని చెప్పుటకు ప్రత్యక్ష ప్రమాణముగా నున్నది.
ఆంధ్ర ద్రావిడ దేశములలోని పల్లె తెగవారును మఱికొన్ని తెగలవారును తాము వహ్నికుల క్షత్రియుల మనియును, పల్లవరాజుల సంతతివారమనియును జెప్పుకొనుచున్నారు.[1]
- ↑ Journal of the Royal Asiatic Society, 1909; see Notes on Archeological Exploration in India 1908-09 by Mr. F.H. Marshall p. 1084.