Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్రావిడపల్లవులు.

తొమ్మిదవ శతాబ్దమున గాంగపల్లవు లాదిత్యచోడుని చేజయింపబడిన తరువాత ద్రావిడదేశములోని పల్లవులు చోడరాజులకడ నుద్యోగపదవులనువహించి వారలను గొలుచుచుండిరి. కళింగట్టుపారణియను ద్రవిడభాషా కావ్యములో జెప్పిన ప్రకారము మొదటికులోత్తుంగ చోడుని కాలములో (క్రీ.శ.1080 మొదలుకొని 1117వఱకు) కళింగదేశముమీదికి దండయాత్రవెడలిన కరుణాకర తొండైమానను రాజుపల్లవుడును చెంగలుపట్టు మండలములోని వందలూరు సంస్థానాధిపతియునై యుండెను. విక్రమచోడుని క్రిందిరాజులలో తొండైమానురాజు మొదటివాడుగానుండెను. పండ్రెండవ శతాబ్దములో పాండ్యరాజ్యాధిపత్యమును గుఱించి జరిగిన యుద్ధములో తొండైమానురాజు కులశేఖరుని పక్షమున జేరెను. కారట్టట్టాంగు గ్రామములో నొకభాగమును బ్రాహ్మణులకు దానముచేసిన సామంతనారాయణుడను సంస్థానాధిపతి తంజావూరు శాసనములలో నొకదానిలో తొండైమానని పిలువంబడెయను. తొండైమానను పేరు క్రమక్రమముగా బల్లవదేశమునుండి చోడదేశమునకు బ్రాకినది. పల్లవరాజని బిరుదువహించి పుదుకోటను బాలించుతొండైమాను రాజుపల్లవులవంశమున జనించెనని తలచుటకు గారణముకలదు.

త్రినయనపల్లవవంశము.

తాము త్రినయనపల్లవులవంశములోని వారమని చెప్పుకొనుచుండిన కొందఱు స్థానికరాజులయొక్క శాసనములనేకము లాంధ్రదేశములో గానంబడుచున్నవి. ఈ త్రినయనపల్లవుడే ముక్కంటికాడుదిట్టియని పిలువంబడుచున్నాడు. ఈ రాజులను తాము భారద్వాజగోత్రులమని చెప్పుకొనియుండిరి. వీరును కాంచీపురమున కధిపతులుగనుండిరి. కాంచీపురము కామాక్షీదేవాలయములోని కానుకోట్యాంహికకు భక్తులుగనుండిరి. వీరిశాసనములు కడప కందవోలు [1]

  1. Journal of the Royal Asiatic Society 1909; see notes on Archeological Exploration in India 1908-09 by Mr,F. H.Marshall, p.1084