పుట:Andhrula Charitramu Part-1.pdf/292

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


డాక్టరు బర్నెలు గారుత్తరద్రవిడదేశ తీరమునుండి వచ్చిన ద్రమిళులని యభిప్రాయపడుచున్నారు. ఇప్పటి ద్రమిళులు సుమత్రాద్వీపమునందు విశేషముగానున్నను ప్రాచీనక్లింగులు కళింగదేశమునుండి వచ్చినవారని యూహించుటకు క్లింగుశబ్దము కళింగ శబ్దమునుండి పుట్టినదని సూచించుటయె ప్రబలాధారముగానున్నది. ఏదియెట్లున్నను పల్లవులకాలమున తూర్పుతీరమునకు సమత్రా జావా ద్వీపములకును వర్తకవ్యాపారము విశేషముగా జరుగుచుండెననియు, ఈ రెండు దేశములనడుమ నోడలు నడుపబడుచుండెననియు, ఆంధ్రద్రావిడ బ్రాహ్మణులు సహితము బరదేశగమనమును నౌకావిహారమును జేయుచుండిరనియును స్పష్టముగా జెప్పవచ్చును. పూర్వమెనుబది తొంబదిదినములవఱకు సముద్రయానము చేయుచుండిన బ్రాహ్మణోత్తములసంతతివారు సముద్రయానము కూడదని నేడు వాదించుట వింతగా గన్పట్టకమానదు. అప్పటి బ్రాహ్మణులయున్న స్థితికిని ఇప్పటి వారి యున్నత స్థితికిని గలకారణము తప్పక గోచరము గాకమానుదు. సముద్రయానము కూడదనివాదించు బ్రాహ్మణులు తమ పూర్వులు వృత్తాంతమును జదువుకొని జ్ఞానవంతులయి దురాగ్రహమును విడిచిపెట్టి దేశాభివృద్ధి కడ్డుపడకహిందూమాతయొక్క అభ్యుదయపరంపరాభివృద్ధికై పరదేశములకుబోయి వచ్చినవారిని భాధింపక యాదరింతురుగాక.

వైష్ణవ మతము.

పల్లవులు నందిని తురాయిగను ఖట్వాంగమును టెక్కెముగ నవలంబించి సర్వసాధారణముగ శైవులుగనున్నను సంస్కృత శాసములం బ్రకటించిన వారిలో గొందఱు వైష్ణవభక్తి పరాయణులుగనున్నట్లు గన్పట్టుచున్నది. కుమార విష్ణువు విష్ణుగోపవర్మ సింహవిష్ణువు మొదలగు పేరులు వైష్ణవమతమును దెలుపునవియైయున్నవి. కుమార విష్ణువు మొదలగు రాజులు విష్ణువాచభక్తిరతులమయిన భాగవతులమని చెప్పుకొనుటయె వారు వైష్ణవమతావలంబుకులని ధ్రువపడుచున్నది. ఈ కాలమునందే వైష్ణవమత యున్నత స్థితికి వచ్చుచున్నదని యూహింపదగియున్నది. ప్రాచీన వైష్ణవాళ్వారు లీకాలమునందే తలయెత్తిరని యూహింపదగియున్నది. ఈ యళ్వారులలో తిరుమలీశైయాళ్వారును