Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్లవరాజొకడు మొదట పరిభవించి తురువాత పశ్చాత్తప్తుడయ్యెనని యొకవైష్ణవగాథగలదు. ఆఱవ శతాబ్దములోని పల్లవులు కొందఱు వైష్ణవమత మవలంబించినను మఱికొన్ని శతాబ్దములవఱకు విజృంభింపకయుండెను. ఇంతకంటె బల్లవరాజులకాలమున వైష్ణవమతమును గూర్చి చెప్పవలసిన విశేషచరిత్రాంశమేదియును గానరాదు.

గాంగపల్లవులు.

పల్లవుల మహారాజ్యాధిపత్యమెప్పుడస్తమించినదో సరియైనకాలము దెలియరాదు గాని నందివర్మ పల్లవమల్లుడే కడపటివాడని విశ్వసింపబడుచుండుటచేత నెనిమిదవ శతాబ్దాంతముతో బల్లవ సామ్రాజ్యమస్తమించినదని చెప్పదగియున్నది. ఇట్లెనిమిదవ శతాబ్దముతో బల్లవ సామ్రాజ్యమంతరించినను ఆంధ్ర ద్రావిడ కర్ణాటకదేశములయుందు బల్లవరాజు లధికార పరిమితిగల చిన్న చిన్న రాజ్యముల కధిపతులై మఱికొన్ని శతాబ్దముల కాలమువఱకు దక్షిణ హిందూదేశమునందు దమతమ పాత్రములను బ్రదర్శించుచునే యుండిరి. కడపటి పల్లవుల చారిత్రము సంగ్రహముగా నొకింత యిట వివరింతుము. ఈ పల్లవకుటుంబములో నొకశాఖవారు కర్ణాటగాంగులతో సంబంధముగలవారమని దెలుపుకొనుచు దొమ్మిదవశతాబ్దాంతమువఱకు తొండైనాడులో విశేషభాగమును బరిపాలించుచువచ్చిరి. వీరలును భారద్వాజగోత్రులమనియును మహాభారతవీరుడైన యశ్వత్థామసంతతి వారమనియు జెప్పుకొనుచుండిరి. ఈ గాంగపల్లవరాజులలో విజయదంతివిక్రమవర్మ, విజయనందివిక్రమవర్మ, విజయనృపతుంగువిక్రమవర్మ, విజయపరాజితవిక్రమవర్ణ యునురాజులు ప్రముఖులుగా గన్పట్టుచున్నారు. తక్కిన విజయనరసింహ విక్రమవర్మ విజయస్కందశిష్యవిక్రమవర్మ, విజయేశ్వరవర్మ అనుమువ్వురు రాజులను పేరులనుబట్టిచూడగా బైవారికి సంబంధించిన వారుగనే గన్పట్టుచున్నారు. ఈ పై నుదాహరించిన గాంగపల్లవులలో నృపతుంగవిక్రమవర్మ శాసనములు బహుభూములయందు బెక్కులు వ్యాపించియుండుటచేత మిక్కిలి పరాక్రమ