Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నదు వనవాసి నగరమున మూడవశతాబ్దమును నాలుగవశతాబ్దమునను బరిపాలించి కదంబులకు నెంతమాత్రమును సంబంధములేదు. మొదటికదంబులు జైనమతావలంబకులు. ఈ కదంబులు బ్రాహ్మణులుకాని మయూరశర్మసంతతివారలు బ్రాహ్మణులు పట్టపుపేరగుశర్మ శబ్దమును విడిచి క్షత్రియుల పట్టపుపేరగు వర్మఅనుదానిని తమనామములతో జేర్చుకొనుటచేత క్షత్రియులుగానే పరిగణింపబడుచుండిరి.

మఱియొక పల్లవవంశము.

గుంటూరు మండలములోని యమరావతీ పట్టణము నొక శిలాశాసనముకలదు.[1] ఆ శిలా స్తంభము చెన్నపురిలోని మ్యూజియములో నుంచబడినది. ఈశాసన మాఱాతిమీదను క్రిందినుండి పైకి వ్రాయబడియుండుట వింతగా కన్పట్టకమానదు. అనగా శాసనమును క్రిందినుండి చదువుట ప్రారంభించవలయును. ఈ శాసనమున నేడుగురు రాజులు పేర్కొనబడిరి. భరద్వాజ ద్రోణాశ్వత్థామలు పల్లవుని పూర్వీకులుగా జెప్పబడిరి. ఈ పల్లవవంశములో చెప్పబడిన రాజులు కొందఱు నందివర్మ పల్లవమల్లుని పూర్వీకులలో బేర్కొననబడియున్నారు. ఈ శాసనములోని పల్లవ రాజులలో గడపటి వాడయిన రెండవ సింహవర్మ జయస్తంభమును నాటుటకై మేరు పర్వతమునకు బోయినట్లుగ జెప్పబడి యుండెను. ఇతడు భాగీరథిని, గోదావరిని, కృష్ణవర్ణనుదాటి ధాన్యకటకమునకు వచ్చి బౌద్ధాలయమును సందర్శించి బుద్ధధర్మమును వినెనని చెప్పబడినది. తక్కిన భాగము శిథిలమయి పోయినది. ఈపల్లవరాజు లెప్పటివారో యెక్కడ పరిపాలనము చేసిరో నిజము తెలియరాదు. ఈ శాసనములో బేర్కొనబడిన వంశము తక్కిన శాసనములలో నుదాహరింపబడిన యేవంశమునకు సంబంధింపక యున్నది. ఆయినను ఈశాసనమలో ఉగ్రవర్మయని యొకరాజు పేర్కొనబడియున్నాడు. సముద్రగుప్తుడు దక్షిణ దిగ్విజయ యాత్రకు వచ్చినప్పుడు పాలక్కడను బాలించు నుగ్రసేనుని జయిం

  1. Madras Journal of Literature and Science1886-87 p.56.