పుట:Andhrula Charitramu Part-1.pdf/274

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


బ్రాహ్మణులు క్షత్రియులకంటె బలహీనులుగానుండవలసివచ్చెనుగదా! క్రమముగా గురుకులమును సేవించి యేకాగ్రచిత్తముతో స్వశాఖావేదము నభ్యసించినవాడు పుణ్యసిద్ధికై రాజానుగ్రమహమునుకు బాత్రుడు గావలయునేని ఇంతకన్న దుఖకరమైన విషయము మఱియేమి కలదు?" అని తనలో దాను వితర్కించుకొనియెను. ఇట్టి వితర్కముతో మయూరశర్మ నిలిచియుండలేదు. అతడు తన తలంపుల నాచరణమునకు దేబూనెను. మున్ను దర్భలను, సమిథలను, పెద్దగరిటెను, కరగిన వెన్నగల యాహుతిపాత్రను జమత్కారముగ బట్టుకొన గలిగిన హస్తముతో భూమిని జయింపగోరి మండుచున్న కత్తిని వరలోనుండి పైకిదీసెను.

పిమ్మట మయూరశర్మ పల్లవరాష్ట్రముయొక్క సరిహద్దులనుండు రక్షకసైన్యముల నతిక్రమించి శ్రీశైలద్వారములవఱకు వ్యాపించి చొఱసాధ్యముకాని మహారణ్యమునంత నాక్రమించి మహాబాణుడు నాయకుడుగా నేర్పడిన రాజమండలినుండి సుంకములను జేపట్టనారంభించెను. ఇట్లనుపమానపరాక్రమవిజృంభణముచే నొప్పుచుండిన బ్రాహ్మణశత్రువును ద్వేషముతో నెదుర్కొనుట ప్రమాదకరమని యూహించి రాజ్యతంత్రజ్ఞుడయిన పల్లవరాజు వానిధైర్యసాహసములను గొనియూడుచు బలిమిచేగాక యుపాయముచే వశపఱచుకొని పశ్చిమ సముద్రతీరమునందు కొంతదేశము నొసంగి పరిపాలనము సేయంబనెను. అయిన నాబ్రాహ్మణయోధవరుని పరిపాల నానంతరము తత్సంతతివారు మాత్రము పల్లవులతోడి మైత్రిపాటింపక గర్భశత్రుత్వమునే వహించి పల్లవాధికారము నెదుర్కొనుచువచ్చిరి. కదంబులలో మృగేశవర్మయను వాడొకడు పల్లవుల కగ్నిహోత్రుడనని చాటుకొనియెను . రవివర్మయను మఱియొక కదంబరాజు కృష్ణవర్మమొదలగు రాజులను జయించుటయెగాక కాంచీపురాధీశ్వరుండును పల్లవరాజునగు చండదండుడను వానిని సింహాసనమునుండి తొలగంజేసెను. నానక్కన పల్లవరాజొకడు కదంబుడగు కృష్ణవర్మ జయించెనని చెప్పబడియెను. ఈ కదంబుల కాలమునుగూర్చి డాక్టరు ఫ్లీటుగారు చర్చించుచు నాఱవ శతాబ్దములోని వారుగ నిర్ణయించి యున్నారు. ఈకదంబులకు వీరికి బూర్వము