Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పథము[1] లోని విరిపరయను గ్రామమును పూర్వకుటార్యుడు గోనందార్యుడు నను నామములను వహించినవారలును, అగ్నివేశ్యగోత్రులును నగునిరువురు బ్రాహ్మణులకు దానము చేసినట్లుగ ధాన్యకటకములో నుండిన తనవ్యాపృతునకు నాజ్ఞ చేయబడినది.

హిరాహడగల్లిశాసనము.

ఇదియును ప్రాచీన ప్రాకృతభాషలోనే వ్రాయబడినదిగాని శాసనము చివరనుండిన యాశీర్వాద వచనమును రాజముద్రికలోని శివస్కందవర్మ పేరును మాత్రము సంస్కృతభాషలో వ్రాయబడినది. ఇందు శివస్కందవర్మ మహారాజాధిరాజనియు, పల్లవులవంశములోని వాడనియు, భారద్వాజ గోత్రుడనియు దెలుపబడినది. ఈ శాసనమును బ్రకటించిన శివస్కందవర్మయు, మైదవోలు శాసనమును బ్రకటించిన శివస్కందవర్మయు నొక్కడేకాని వేఱ్వేఱురాజులుకారు. ఇందధిక విశేషమొకటికలదు. ఇతడు అగ్నిస్తోమము, వాజపేయము, అశ్వమేధము మొదలగు క్రతువులనుజేసినట్లుగ జెప్పబడినది. శివస్కందవర్మకు బూర్వముండిన బప్పా యనుమహారాజు చిల్లరేక కోడంకయను గ్రామములోని తోటనొకదాని బ్రాహ్మణులకు దానము చేసియుండగా దానినే మరలబేర్కొనుచు నొక నూర్పుడు కళ్లమును, నివేశనములను గూడ నీతడే దానముచేసినట్లుగ నీశాసనమున వ్రాయించబడినది. ఇందు బేర్కొనబడిన బప్పాకోటిసువర్ణములను దుక్కిటెడ్లతోడిలక్షయరకలను బ్రాహ్మణులకు దానముచేసి యుండెనని పేర్కొనబడియుండెను.

  1. శివస్కందవర్మకు బూర్వముండిన శాసనములలో నాంధ్రశబ్దముపయోగింపబడియుండలేదు. ఆంధ్రమనుమాట ఉపయోగింపబడిన శాసనమిదియె మొదటిదని తోచుచున్నది. ఆంధ్రపఖమె ఆంధ్రమండలమని కొన్ని శాసనములలో బేర్కొనబడినది. అఱవలశాసనములలోనియ్యది వడుగావళియ్ని పేర్కొనబడినది.