పుట:Andhrula Charitramu Part-1.pdf/250

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పండ్రెండవ ప్రకరణము.

శివస్కంద వర్మ.

ఇతడు కాంచీపురమునుండి ప్రకటించిన తామ్రశాసనములు రెండుగలవు. అందొకటి బళ్లారిమండలములోని హిరావాడగల్లి(హర్పనహల్లి) గ్రామంబున దొరకినది [1] మఱియొకటి యిప్పటి గుంటూరు మండలములోని నరసరావుపేటకు దూర్పున 16 మైళ్లదూరమునవున్న మైదవోలను నొక చిన్నగ్రామమున దొరకినది. [2] శివస్కందవర్మయువమహారాజుగనుండినపుడు మైదవోలు శాసనమును మహారాజుగనుండినపుడు హర్పనహల్లిశాసనమును బ్రకటింపబడినవి.

మైదవోలుశాసనము.

ఈ శాసనము ప్రాచీన ప్రాకృతభాషలో వ్రాయబడి కాంచీపురమనుండి ప్రకటింపబడినది. ఇందుశివస్కందవర్మ యువ మహారాజుగ బేర్కొనబడియుండెను. తాను భారద్వాజగోత్రుడననియు, పల్లవులవంశములోనివాడననియు జెప్పుకొనియుండెను. ఈ శాసనము వ్రాయబడినతేది శివస్కందవర్మకు బూర్వము రాజ్యముచేయుచుండిన రాజుయొక్క పదయవ పరిపాలన సంవత్సరమున గ్రీష్మఋతువు నాఱవపక్షములోని పంచమి తిథిగానున్నది. ఆంధ్ర

  1. Ep.Ind. Vol I page. 2;
  2. Ibid Vol Vl.p.85. ఇది మైదవోలులో మైదవోలు జయరామయ్యగారి పొలములో దొరకినది మ జయంతి రామయ్యపంతులు బి.ఎబి.ఎల్ గారివలన బంపబడినది.