ఈశాసనములో దానముచేసినట్లుగ నుదాహరింపబడిన తోటయొక్కఫలము ముప్పదినాలుగు భాగములుగ విభాగించి యిరువదినాలుగు బ్రాహ్మణుకుటుంబములకు నొక్కొక్కొనికి నొకభాగము మొదలుకొని నాలుగుభాగముల వఱకు దానముచేయబడియుండెను. ఈ శాసనము కోలివోలా గ్రహారీకుడును మంత్రాలోచన సభ్యుడును నగుభట్టిశర్మ యొక్క స్వహస్త విలేఖనముతో గూడినదిగ నున్నది. దీనిని రాజు స్వయముగా బరిశోధించి చేవ్రాలు చేసియుండెనట. శాసనము తుదను గోబ్రాహ్మణులకును, విలేఖకునకును, పాఠకులకును, వినువారికి శుభవాక్యము పలుకబడియెను. తనవంశముయొక్కయు, తనజాతియెక్కయు, పరంపరాభివృద్ధికిని యశోభివృద్ధికిని ఈ దానము చేయబడినట్లుగ జెప్పబడినది.
కాలనిర్ణయము.
శాసనములోని భాషను బట్టియు, అందుదాహరింపబడిన కాలమునుబట్టియు శివస్కందవర్మ క్రీస్తుశకము రెండవశతాబ్దములోనివాడని రివరెండు టి. ఫపుల్క్సు గారు యుక్తియుక్తముగ సిద్ధాంతీకరించినారు. [1] ఇంత సహేతుకమైనవాదము మఱియొకటిగానరాదు. వీరు శివస్కందవర్మ రెండవశతాబ్దములోని యాంధ్రభృత్యులతో సమకాలికుడని రెండు హేతువులను జూపిరి. ఆంధ్రభృత్యుల శాసనములలోని భాషయె యీశాసనమునందును గానవచ్చుట మొదటిది. దానము చేసినతిథి తెలుపబడినవిధాన మాంధ్రభృత్యులశాసనములలోని విధానమును బోలియుండుట రెండవది. ఈ రెండు హేతువులచేత నాంధ్రభృత్యులకు దూరముననుండువాడు కాడనియును, సమకాలికుడనియును సిద్ధాంతము చేసినారు.
శివస్కందవర్మ శాసనములలో శాలివాహన శకసంవత్సరములకు మాఱుగా వానిపరిపాలన సంవత్సరములయొక్క సంఖ్యలు పేర్కొనబడినవి. మాసము
- ↑ The Journal of the Royal Asiatic Society,Vol XXI. (New series),IV. pp 1111 to 1124,