పుట:Andhrula Charitramu Part-1.pdf/245

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మానురాజు నాగ స్త్రీకిని చోళరాజునకు రహస్యముగాబుట్టిన (జారజుడు) కొడుకని గాథకలదు. ఈజారజుడయిన చోళరాజ కుమారునకు నొసంగబడిన దేశముయొక్క మొదటినిజమైనపేరు తొండయనికూడ సూచింపబడియెను, తొండారమండలమనుగా బానిసలదేశము. ఆయినను ఈ కథ పల్లవుల నిజస్థితిని దెలుపజాలకున్నది. నెడముడిక్కిళ్లి యను చోళరాజొకడు తన రాజధానీనగరముగు కావీరిపద్దినములోని యువవనములోనొక నాగకన్యకను గలిసికొనియెనని చెప్పబడినది. ఆమె పేరు పాలవలై యనునది. వలైమానను నాగరాజుయొక్క కొమార్తె. నాగరాజకుమారిక వలన జోళరాజునకు బుత్రుడు జనించెను. అయినను కాంచీపురదేశమే రాజకుమారునకొసంగినట్లుగ నిచ్చటనేమియు నుదాహరింపబడలేదు. కాబట్టి యాకథపైకథకు విరుద్ధముగాగన్పట్టుచున్నది. ఈ కథలు శాసనములలో నెచ్చటనుగనరావు. కాని గాంగపల్లవుడయిన స్కందశిష్యవిక్రమవర్మయొక్కరాయకోటశాసనములో గొంచెము సూచనగలదు. మఱియే శాసనమునందును వినరావు.

కురుంబాలుపల్లవలా.

సర్ వాల్టర్ ఎలియాట్ గారి యభిప్రాయము ప్రకారము ద్రావిడదేశములో విశేషభాగమునకు పూర్వము కురుంబభూమియని పేరుగలదు. ఈ ద్రావిడ దేశముయొక్క దూర్పుభాగము చోళులచేత జయింపబడినమీదట తొండైమండలమని పిలువంబడుచుండెను. ఇదికురంబాలవలన 24 కొట్టములుగా విభాగింపబడినది. కరికాలుడనుచోళరాజు కురుంబాలను జయించినవాడని చెప్పబడియెను. ఈ కురుంబజాతి యేశాసనమునందు నుదాహరింపబడి యుండలేదు. వరాహమిహిరాచార్యుని బృహత్సంహిత యందయిన నుదాహరింపబడియుండలేదు. వారలు యదువంశజులనియు, జైనమతావలంబికులనియు స్థానిక చారిత్రములందు మాత్రము పేర్కొనబడిరి. పల్లవులు తప్పకకురుంబాలని నిశ్చయింపవలనగాదు. ఎల్లియాట్ గారు కొన్ని నాణెములను కురుంబాలవనియు కొన్ని నాణెములను పల్లవులవనియు నిర్ణయించియున్నారు.