లను వశపఱచుకొనిరి. బ్రాహ్మణులు తమ కార్యములను సాధించుకొని లాభమును బొందియుందురు. అశ్వత్థామ యాగ్రహము జూసి విజృంభించినతోడనే భీమార్జునకృష్ణులు భయంపడి పిఱికి పందలై యాయుధములను విడిచిపెట్టి చేతులు జోడించుకొని నిలంబడిరని కాసకుడి తామ్రశాసనమునం దశ్వత్థామ పరాక్రమము వర్ణింపబడినది. ఇట్టివర్ణన పల్లవులను సంతోషపెట్టుటకు గాక మఱియెందులకు?
పార్థియనులే పహ్లవులు.
పహ్లవశబ్దమునుండి పల్లవశబ్దమేర్పడినదని కన్పట్టుచుండగా పార్థియను శబ్దముయొక్క వికృతరూపమె పహ్లవమని విశ్వసింపబడుచున్నది. హిందూపార్థియనులు పహ్లవులని భాండార్కరు గారు నుడువుచున్నారు. పార్థియనులు క్రీస్తునకు బూర్వము 161 వసంవత్సరమున కాబూలుకనమలో స్థిరవసతులేర్పఱచుకొనిరని కన్పట్టుచున్నది. [1] [2] పార్థివులు కౌశికులులోనొక శాఖవారుగనున్నారు. వీరు విశ్వామిత్రునియొక్క సంతతిలోని వారు. పహ్లదపుర స్తంభము మీది శాసనములో శిశుపాలుడను రాజుపార్థివ రక్షకుండను బిరుదును గలిగియున్నట్లు వ్రాయబడినది.[3]
తొండైయారులు.
పల్లవులు తొండైయారులని ద్రవిడభాషాగ్రంథములలో బిలువబడినట్లుగా గన్పట్టుచున్నది. పల్లవరాజు "తొండైమాన్" అని పిలువంబడి యుండెను. ఎనిమిదవశతాబ్దమున పల్లవదేశము తుండకవిషయమని పిలువంబడియుండెను. ఈ నామోత్పత్తి యెట్లు గలిగినదో స్పష్టముగ దెలియరాదు. మొదటితొండై