Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తుండకవిషయమె దండకనాడు.

తొండైమండలమనుపల్లవదేశమునకు నుత్తరమున తిరుపతి కాళహస్తి పర్వతములును, దక్షిణమును పాలేఱును, పడమటిఘాట్టు (గట్టు) లని తొండైమండల శతకమున జెప్పబడియెను. అన్యవిరచితమైనదని చెప్పు నొక పద్యములోను త్తరమున వెంగడమనియు (తిరుపతి) దక్షిణమున పినగైయను నదియు తూర్పున సముద్రమును, పశ్చిమమున దూర్పుకనమలనియు జెప్పబడియుండెను. తొండైమండలము దండకనాడుయొక్క రూపాంతరముగ గన్పట్టుచున్నది. దండకనాడనునది దండకారణ్యమును సంస్కృతమునుండి యేర్పడినిదిగ గన్పట్టుచున్నది.[1] [2]

పల్లవులాంధ్రులలోని వారెగాని యన్యులుగారు.

పల్లవులనుగూర్చి యెవ్వరెవ్వరెట్లెటు భావించినదియు గొంతవరకు దెలిపియుంటిమి. పల్లవులు తమిళజాతులలోని వారెంతమాత్రమును గారనియు, ఆంధ్రులలో నొక తెగవారనియును కొందఱి యభిప్రాయమైయున్నది. విన్సెంటు స్మిత్తుగారు తమ దక్షిణహిందూదేశచారిత్రమునందు బల్లవులనుగూర్చి కొంచెము వ్రాసియున్నారు గావున వారి యభిప్రాయమునొకించుక నీక్రింద నుదహరించుచున్నారము.

"పల్లవనామము పహ్లవనామము బోలియుండుటచేత డాక్టరు ప్లీట్(Dr Fleet) మొదలుగు చరిత్రకారులు పల్లవులు పహ్లవులొక్కరేయని యభిప్రాయపడి కాంచీపురము నేలిన దక్షిణపల్లవ వంశము పారసీకమునుండి జన్మగాంచినదని యభిప్రాయపడుచున్నారు. ఈ గ్రంథముయొక్క మొదటికూర్పునందట్టి యూహసంభవమని తలంచినను నూతన పరిశోధనమీయూహను బలపఱచుచుండలేదు. చెన్నపురి రాజధానికి నుత్తరభాగమున ననగా కృష్ణాగోదావరులకు నడుమనుండిన వేంగిదేశమున నేర్పడిన యొకతెగవారని గన్పట్టుచు

  1. Taylor's Catologue Vol.Ill, p, 29.
  2. Bombay Gazetteer Vol.I, part p. 319.