వులయినను పాండ్యచోళులయినను మఱి యెవ్వరయినను మొదట వారెక్కడ నండినను దక్షిణాపథమునకు వచ్చి యిచ్చటి భాషలను, ఇచ్చటి మతముల నవలంబించి దేశస్థులలో గలసిపోయిన వారగుట చేత స్వదేశస్థులుగా బరిగణింపబడవలసిన వారగుచున్నారు.
అశ్వత్థామ వంశమనుటకు గారణము.
పల్లవులకును, పాండ్యులకును గర్భశత్రుత్వముగలదు. పాండ్యులు తాము పాండవులసంతతి వారమని చెప్పుకొన మొదలు పెట్టిన నాటనుండియు బల్లవులును తమ పూర్వులు భారద్వాజ గోత్రులమని చెప్పుకొని యుండుటచేతను, పాండవుల బంధుపుత్రమిత్రవారమును నిర్మూలము చేసిన వాడశ్వత్థామయగుటచేతను, భారతమునందు నశ్వత్థామ ద్రోణపుత్రుడుగను భారద్వాజుని మనుమడుగను జెప్పబడియుండుటచేతను, ఆశ్వత్థామ పాండవ బలముల నిర్మూలమును చేసినట్లుగ బాండవుల సంతతివారయిన పాండ్యుల బలమును అశ్వత్థామ సంతతి వారయిన పల్లవులు నిర్మూలము చేయగలరని సూచించున దగుటచేతను, అశ్వత్థామకు బల్లవుడు జనించెననియు, ఆ పల్లవుని వంశమునందే తాము జన్మించుటచేత తమది పల్లవవంశమని చెప్పుకొనుచుండిరిగాని నిజముగా నశ్వత్థామకు జనించిన పల్లవుని వంశజులైనయడల నయదార్థములును వ్యత్యస్తములును నగువిషయములను వంశచారిత్రములందు జెప్పుకొనకయే యుందురు. అశ్వత్థామ బ్రహ్మచారియని మహాభారతమునుబట్టి మన మెఱుంగుదుము. అశ్వత్థామకు భార్యలేదుగనుక నప్సరసనొకదాని ముడివెట్టిరి. పల్లవులు బ్రాహ్మణులనాదరించి పోషించిరి. పాండ్యులు మొదటజైనమతావలంబికులుగ నుండిరి. తరువాత శైవులయరి. వీరు బ్రాహ్మణులుకు బ్రతిపక్షులుగ నుండిరి. కనుక బ్రాహ్మణులు తఱుచుగా బల్లవులపక్షమున నుండుచువచ్చిరి. పల్లవుల శాసనములను వ్రాసినవారు బ్రాహ్మణులే. తమ పక్షమునుబూని తమ్మునాదరించుట కొఱకు వారిని బ్రహ్మకులమని, భారద్వాజ గోత్రులని, అశ్వత్థామ సంతతియని పల్లవరాజవంశమని వారలకుల్లాసముగలుగునట్లుగా బొగడి యిట్టివెన్నియే గల్పించి వార