యుండిరి. మనువును, ఇక్ష్వాకును, మాంధాతను, ముచికుందుని, శిబిని తమ పూర్వులుగా చోళరాజులు చెప్పుకొనిరి. తమ వంశము పురూరవ చక్రవర్తి నుండి ప్రారంభమైనదని పాండ్యులు చెప్పుకొనిరి. సగరుడు, భగీరధుడు, రఘువు, దశరధుడు, రాముడు తమ పూర్వులని చేరరాజులు చెప్పుకొనిరి. చాళుక్యులును చంద్రవంశరాజులులను బెక్కండ్రను బేర్కొనిరి. రాష్ట్రకూటులు యదువంశజులమనియు సాత్యకి సంతతి వారమనియు జెప్పుకొనిరి. పశ్చిమగాంగులు తమది చంద్రవంశమనియు పురూరవుడు, ఆయువు, నహుషుడు, యయాతి, దుర్వసుడు తమ పూర్వులనియు జెప్పుకొనియుండిరి. తలకాడులోని పశ్చిమగాంగులు తమది సూర్యకులమనియు ఇక్ష్వాకుడు తమపూర్వుడనియు జెప్పుకొనియుండిరి. పల్లవ వంశమున బౌరాణిక రాజులలో నొక్కని పేరు మాత్రము గానంబడుచున్నది. అశోకవర్మ పల్లవుని గొడుకని చెప్పబడియున్నది. సూర్యవంశజుడగు అశోకచక్రవర్తి పేరే అశోకవర్మగా మార్పబడి యిందు చేర్చబడినదని డాక్టర్ హాల్‍ట్‍జ్(hultzseh)గారూ హించినది సరియైనదిగా నున్నది. [1] [2] [3]
ఇట్లు పాండ్యచోళకేరళాదు లవలింబించిన పద్ధతికి విరుద్ధమైన పద్ధతి నవలంబించి వారలకు ప్రబలశత్రువులుగ నుండుట చేత పల్లవులు విదేశస్థులయిన జాతిలోని వారనియును పాండ్యచోళకేరళాదు స్వదేశస్థులయిన స్వజాతీయులలోని వారనియు రావుబహదూరు వెంకయ్యగారు వ్రాయుచున్నారు గాని పాండ్యచోళకేరళాదులు వెంకయ్యగారు తలంచుచున్నట్లుగా మొట్టమొదటి త్రివిష్టప (Tibet)ప్రాంతదేశముల నుండి వచ్చిన వారని నాలుగవ ప్రకరణమందు వ్రాసి యుంటిమి. కాబట్టి పల్లవులు విదేశస్థులయినచో పాండ్యచోళాదులును విదేశస్థులుగా చేసి పరిగణింప బడవలయును. పాండ్యచోళాదులు స్వదేశస్థులయిన స్వజాతీయులుగా బేర్కొనబడినప్పుడు పల్లవులను గూడ స్వదేశస్థులయిన స్వజాతీయులుగానే పేర్కొనవలసి యుండును.[4] పల్ల