పుట:Andhrula Charitramu Part-1.pdf/240

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


లయిపోయిరని మనువుగూడ వ్రాసియుండెను. కాళిదాసు తనరఘువంశమునందు రఘుమహారాజు దిగ్విజయము వర్ణించు పట్టున యవనులను హిందూదేశమునకు పశ్చిమదిశను బేర్కొని యున్నాడు. పారసీకులను జయించుటకై రఘుమహారాజు త్రికూటము నుండి మెట్టదారిన బోయెనని చెప్పియుండెను. యవనులను జయించిన తరువాత పారశీకులను జయించెనని చెప్పియుండెను.వీనింబట్టి పౌరాణిక కాలమునందు పహ్లవులు పరిపాలన భారము వహించిన ఒక జాతి వారని స్పష్టమగుచున్నది. వారు బ్రాహ్మణ కర్మలననుసరించుట లేదని చెప్పుట చేత వారు విదేశస్థులనియు, విజాతీయులనియు, వారి పూర్వులెప్పుడో యీదేశమునకు వచ్చి యుండిరనియు దేటపడుచున్నది.

శాసనములోని పల్లవ రాజవంశము.

పల్లవవమను సంస్కృతశబ్ధమునకు చిగురని యర్ధము. పల్లవ వంశములోని బూర్వికుడయిన పల్లవుడు పల్లవముల పల్లకిలో నాకస్మికముగా నశ్వత్థామకు జనించుట చేత నతనికా పేరు వచ్చినదనియు, వారి సంతతి వారలు పల్లవులయిరనియు కానకుడి తామ్రశాసనమున జెప్పబడియెను. ఇయ్యది నంది పల్లవమల్లునిచే వ్రాయించబడినది. పరమేశ్వరవర్మ కురము శాసనమునందును, ఉదయేంద్రము శాసనమందును ఆశ్వత్థామకు పల్లవుడు జనించెనని లిఖింపబడియెను.[1] కానకుడి తామ్రశాసనమందు అశ్వత్థామకు నప్సరసయగు మేనక యందు పల్లవుడు జనించెననికూడ చెప్పబడియున్నది. [2]. అయినను సింహవర్మ

అమరావతీ శిలా స్థంభముపై వ్రాయించిన శాసనములో అశ్వత్థామకు మదనికయను నప్సరస వలన పల్లవుడు జనియించెనని గానంబడుచున్నది. [3]ప్రాచీన పల్లవరాజులు తమ శాసనములలో దాము పల్లవులమనియు భరద్వాజ గోత్రీకులమనియు వ్రాసికొని యుండిరి [4]కాని తరువాతి వారు పోయిన పోక లేవియు వారిశాసనములందు

  1. రఘువంశము సర్గము 4 శ్లో 56 మొదలు 64 వఱకు
  2. South Indian Inscriptions Vol. I, p.152; Ibid Vol. II.p.370.
  3. Ibid Vol.II, p.355.
  4. Ibid Vol.I.p.27