Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యెను. వారు సగరునిచేత జయింపబడిరి గాని కులగురువగు వశిష్టుడడ్డు పడుట చేత నిర్మూలము చేయబడక విడిచిపెట్టబడిరి. మాంధాతయను రాజు పహ్లవుల [1] విధులను గూర్చి యింద్రుని ప్రశ్నించినట్లుగ మహాభారతము లోని శాంతిపర్వములో 24వ యధ్యాయనం జెప్పబడినది. అచ్చట యవనులు, కిరాతులు, గాంధారులు, చీనులు, శబరులు, బర్బరులు, శకనులు, తుషారులు, కంకులు, ఆంధ్రులు, ముద్రకులు, పుండ్రకులు, పుళిందులు, రమతులు, కాంభోజులు మొదలగు వారితో పహ్లవులు చేర్పబడిరి?

వశిష్ట మహాముని కామధేనువు రంకెవేయునపుడు జనించిన పహ్లవులు మొదట క్షత్రియులయినను క్రమముగా శూద్రులయిరనియు హరివంశము రామాయణములలో జెప్పంబడియెను. అచ్చట వీరలు శకనులతోను, యవనులతోనూ, కాంభోజులతోనూ జేర్పబడి యాజాతికి ముఖ్యమైన గురుతుగడ్డమని [2]యు దానిని ధరించుటకు సగరుడనుమతించెననియు గూడ చెప్పబడియెను. విష్ణుపురాణమునందును యవన పహ్లాది కాంభోజులు మొట్ట మొదట క్షత్రియులయినను బ్రాహ్మణులనుండియు బ్రాహ్మణ వంశముల నుండియు వేరుపడిన వారగుట చేత శూద్రులయి పోయిరని చెప్పబడియెను. [3]మొదట వీరు క్షత్రియులేయనియు, పవిత్రకర్మలను విడనాడి బ్రాహ్మణాధికార మతిక్రమించుట చేత శూద్రు

  1. టి క్రిష్ణమాచారి, వ్యాసాచార్యులు గార్లచే ముద్రింపబడుచుండిన సంస్కృత మహాభారతములో పహ్లవశబ్ధమునకు బదులుగా పల్లవ శబ్ధమే గ్రహింపబడినదనియు, దక్షిణ హిందూదేశములోని వ్రాతపతునలను బట్టి తామా గ్రంధమును బరిష్కరించి ముద్రించుచున్నారమని సంపాదకులు తమతో జెప్పినట్లుగ రావుబహదూర్ వి.వెంకయ్య ,ఎం.ఎ గారు వ్రాయుచున్నారు.
  2. పాశ్చాత్యుల (అనగా యవనుల గడ్డములను గూర్చి కాళిదాసు గూడ తన రఘువంశము చతుర్ధసర్గమున 63వ శ్లోకమున బ్రశంశించి యున్నాడు.
  3. Muir Sanskrit Texts Vol. II. p. 259, and Indian Antiquary Vol. IV, p.;66