పుట:Andhrula Charitramu Part-1.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డు), పాప (డు), కుబీరక (కుంభీరకుడు - ఇతడొక రాజు), గాలిక (డు), శ్రామణదాస (డు), భారద (భారతుడు), ఒదల (ఔదరుడు), స్థౌలతిష్య(డు), తిష (తిష్యుడు), గిలన (జ్ఞానుడు), జంభ (డు).....ఋవ (ఋవుడు), ... జనక (డు), గోపాలక (డు), ఉపసాదునికొడుకుకూర (డు), కరహునికొడుక ఉత్తర (డు).

పౌరసభాసభ్యుల నామములు:- వచ్చ(వత్సుడు), చఘ(జఘన్యుడు), జెటా (జెటుడు), జంభ(డు), తివ(త్రిష్యుడు), రేత (రైవతుడు), అచిన (అచీర్ణుడు), సభిక (డు), అఖఘ(అక్షఘ్నుడు), కేల (డు), కేశ(డు), మాహా (మాఘుడు) నేత (స్వైత్రుడు), చడిక (చండికుడు), ఓఖబల, ఓఘబలుడు, సోనుతర (సోనుత్తురుడు), సుసర్ణోత్తర (డు), సామన (శ్రామణుడు), సామనదాస (శ్రామణదాసుడు), సామక (శ్యామకుడు), కాముక (డు), చితక (చిత్రకుడు).

వర్తక సంఘములు.

ఆ కాలమున వాణిజ్యము చేయుచుండిన వణిక్కులు విశేషభాగ్యమును సంపాదించినట్టు గానంబడుచున్నది. కార్లీలోని గొప్ప చైత్యగుహను జయంతీనగరములోని యొక సేఠ్ వలన నిర్మింపబడియె నని చెప్పబడినది. ధాన్యకటకము, కన్హేరి మొదలగు స్థలములలో గూడను వారి దానములు మిక్కిలి విలువగలిగినవిగా నున్నవి. సేఠ్ అనుశబ్దము శ్రేష్ఠియనుదాని ప్రాకృత రూపము. సేఠ్ యొక్క వికృతియె తెలుగులో సెట్టియగుచున్నది. సెట్టియనగా వర్తకుడు. ఆ కాలములో వర్తకసభలు పెక్కులుండినవి. నేతగాండ్రకు, గాంధికులకు ధాన్యక శ్రేణులకు, నూనె మొదలగువానిని తయారు చేయవారలకు బ్రత్యేక వర్తకసభలు గలవు. ఈ సభలన్నియు గ్రమమైన యేర్పాటులను నిబంధనములను కలిగి యోగ్యస్థితి యందున్నట్లుగ గానంబడుచున్నవి. ప్రజలు తమ సొమ్మును శాశ్వతముగా నీ సభలవద్ద భద్రముగా నుంచుకొనుటయు, వారలు వీరలకు తరతరములవఱకు వడ్డి నిచ్చుచుండుటయు గూడగలదు. ఈ సభల మూలమున [1] స్వపరి

  1. Epigraphia India, Vol.II. pp. 326. 329.