హమును గలవు. కుడ్యములపైన బుద్ధుని జీవితములోని చర్యలును దెలుపు ప్రదర్శనములు చిత్రింపబడినవి. స్తంభములును కప్పును చిత్రవిచిత్రములయిన నగిషీ పనులచే వెలుగొందుచున్నవి. వీనినన్నిటిని గన్నులార వీక్షించునప్పుడు గలుగునట్టి యానందము వర్ణనాతీతమై యుండును. అందలి స్త్రీపురుషుల విగ్రహములుసొగసుగను స్వభావసిద్ధములుగను ముఖవికాసములు సత్వవృత్తిని సూచించునవిగను నాహ్లాదకరములుగను నున్నవి. అలంకారములు పరిశుద్ధములయినవిగను క్రమపద్ధతికలవిగను నున్నవి.
ఆకాలపు స్తూపములయొక్కయు, చైత్యములయొక్కయు, విహారములయొక్కయు, విగ్రహములయొక్కయు, రూపపటములను ముద్రింపవలయునన్న విశేషవ్యయప్రయాససాధ్యమైనది కావున శిల్పకారుల బుద్ధికుశలతను, చిత్రవిద్యలతీరును జూపుటకు నీయొకటి రెండుపటములను మాత్రము ముద్రింపగలిగితిమి.
మతసంఘములు-పౌరసభలు.
ఆ కాలమునందు మతకార్యములను ధర్మకార్యములను నిర్వహించుటకై యీకాలపు దేవస్థానసంఘములవలెనె మతసంఘములును పౌరజనోపయోగకరములయిన కార్యములను నిర్వహించుటకై యీకాలపు పౌరసభల (Corporations) వలెనె పౌరసభలు నేర్పడియుండినవి. అట్టి సభలు రెండు పేర్లతో భట్టిప్రోలు శాసనములలో గన్పట్టు చున్నవి.
ధర్మకార్యనిర్వాహక సంఘములోని సభ్యులు:- హిరణ్యవ్యాఘ్రపాద(డు);ఉగలక (ఉద్గారకుడు), కలహ(డు)[1], విసాక (విశాఖుడు), స్థౌలశీర్షి, శ్రామణ (డు), ఒదల (ఔదరుడు), అపక (డు), సముద్ర (డు), అనుగ్రహ(డు), కూర (డు), శత్రుఘ్న(డు), పోతక (డు), పోత (డు) అలినాక (అలినాగడు), వరుణ(డు), పింగళక(డు), కౌశిక(డు), సూత (సూత్రు
- ↑ కలహ (డు) అనుదానిని కలహుడని చదువుకొను రీతిగానే తక్కిన నామములను డు ప్రత్యయమును జేర్చి చదువుకొనవలయును