పుట:Andhrula Charitramu Part-1.pdf/22

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


(Early History of India), అను గ్రంథమును, డాక్టరు భాండార్ కర్ గారి అర్లి హిష్టరీ ఆఫ్ డక్కన్ (Early History of Deccan), అను గ్రంథమును, కనకసభాపిళ్ళెగారి టమిల్సు ఎయిటీన్ హండ్రెడ్ ఇయర్సు ఎగో (Tamils : Eighteen Hundred years Ago), అను గ్రంథమును నాకుఁజాల సహాయమును జేసినవి.

ఇవిగాక చెన్నపురిలోని క్యాన్నిమరా లైబ్రరీలో నున్న "ఇండియన్ ఆంటిక్వేరీ (Indian Antiquary)లోను, "ఎపిగ్రాఫియా (Epigraphia) ఇండికా" (Indica), లోను ఎపిగ్రాఫియా కర్నాటికా (Epigraphia Karnatica), లోను డాక్టర్ హల్ టెజ్ గారిచేఁ బ్రకటింపఁబడిన సంస్కృత ద్రావిడ శాసనముల సంపుటముల (South Indian Inscriptions) బ్రకటింపఁబడిన పురాతన శాసనములును చరిత్ర శోధనములో నింతింత యనరాని తోడ్పాటూ జూపినవి. "డిస్ట్రిక్టు గెజిటీర్స్" (District Gazetteers), "డిస్ట్రిక్టు మ్యాన్యుయల్సు" (District Manuals), అను గ్రంథములును గొంతవఱకుఁ దోడ్పడినవి.

ఇంతియగాక ఏషియాటిక్ రీసర్చెస్ (Asiatic Researches) అను పత్రికా సంపుటములును, మెడ్రాస్ జర్నల్ ఆఫ్ లిటరేచర్ అండు సైంస్ (Madras Journal of Literature and Science), అను పత్రికా సంపుటములును, రాయల్ ఏషియాటిక్ సొసైటీ వారిచేఁ బ్రకటింపఁబడు పత్రికా సంపుటములలోఁ బ్రకటింపఁబడిన కొందఱి లేఖలును చర్చలును నాకు విశేషసహాయ మొనర్చినవి.

మఱియును ఆర్కియోలాజికల్ సర్వే డిపార్టుమెంటు వారిచేఁ బ్రకటింపఁబడుచుండిన యెపిగ్రాఫిని గూర్చిన రిపోర్టులును