ఈ పుట ఆమోదించబడ్డది
(Annual Reports on Epigraphy) గూడ నెక్కువగాఁ దోడ్పడినవి.
ఈ పైఁ జెప్పినవిగాక బ్రహ్మశ్రీ పాడివేంకటనారాయణ పాఠీగారిచే విరచింపఁబడిన యాంధ్రాక్షరతత్త్వమును, బ్రహ్మశ్రీ రావు బహదరు వీరేశలింగము పంతులుగారిచే రచియింపబడిన యాంధ్రకవుల చరిత్రమును, బ్రహ్మశ్రీ వేదము వేంకటరాయశాస్త్రిగారిచే విరచించబడిన కథాసరిత్సాగమును, బ్రహ్మశ్రీ కొమఱ్ఱాజు వేంకటలక్ష్మణరావుపంతులుగారిచే రచింపఁబడిన హిందూదేశ కథాసంగ్రహమును గూడ నాకుఁ గొంచెము తోడ్పడినవి గావున వారికిని నావందనము లర్పించుచున్నాఁడను.
చెన్నపట్టణము 15-3-10 |
చిలుకూరి వీరభద్రరావు |