పుట:Andhrula Charitramu Part-1.pdf/217

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


రును క్రమక్రమముగా మాంసభోజనము వర్జించిరి. నేడు పంచద్రావిడ బ్రాహ్మణుడు మాంసమును ముట్టరు. వీరు దాక్షిణాత్యులు. పంచగౌడబ్రాహ్మణులు మాత్రము వర్జింపలేదు. వీరౌత్తరాహులు. ఇప్పటి బ్రాహ్మ్ణోత్తములగు దమపూర్వు లొక కాలమున మాంసభోజనము చేయుచుండిరను మాటయే తెలియదు. అట్టిమాటయే వారికి గర్ణకఠోరముగా నుండకమానదు. బహుశతాబ్ధముల క్రిందటనే యాదురభ్యాసమును విడిచి పెట్టిన వారు కనుక వారికట్లుండుట సహజగుణమె గాని యందు విరుద్ధగుణమేమి లేదు. ఆర్యులాకాలమున బరిపాలనము చేయు నాంధ్రులను కేవలమును శూద్రులుగా జూచి యుండ లేదు. వారిని క్షత్రియులని పైకి చెప్పుచూ వచ్చిరిగాని కర్మాధికారమును గలిగింపక లోపల ద్వేషభావమును గలిగియుండిరి. మొదట నామమాత్రముగా నేర్పడిన వర్ణాశ్రమ బంధనములు సడలియున్నవి గాని కాలముగడచిన కొలదిగట్టిగా బిగింపబడుచు వచ్చినవి. మనుస్మృతి యందు జెప్పబడిన భేదకారణములు కేవలము కల్పితములు కాని స్వాభావికములు గావుగనుకనవి యెంతమాత్రము విశ్వసింప దగినవి కావు.

ఇతర మతములు.

ఆకాలమునందు శైవమతమును జైనమతమునుగూడ వర్ధిల్లు చుండెను. రాజప్రతినిధిగ నుండి నవకాశి రాజధానిగా జేసికొని దక్షిణ కొంకణమును, కర్ణాటమును బాలించిన హరితపుత్ర శాతకర్ణి కర్ణాటకము (మైసూరు) లోని స్థావకందూరువద్దనున్న శివాలయమునకేదో దానధర్మము చేసెనని కుజ్జుడను కర్ణాట కవిప్రాశస్తియను కావ్యమందు వ్రాసి యుండునట్టి యాంధ్రరాజుల పోషకత్వమున శైవమతము కూడ వర్ధిల్లు చుండెనని చెప్పవచ్చును. ఆర్యులలోను బౌద్ధులలోను మొదట విగ్రహారాధనములేదు. విగ్రహారాధనము మొదట ననార్యులలో నాగులలోను విశేషముగా వ్యాపించి యుండెను. తరువాత బౌద్ధులచేతను, అటుపిమ్మట ఆర్యుల చేతను అవలంబింపబడినది.

దేశభాషాభివృద్ధి.

ఆకాలమున నార్యబ్రాహ్మణులు సంస్కృతప్రాకృత ములను వాడుకొను