పుట:Andhrula Charitramu Part-1.pdf/216

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఈ విషయమును బ్రాహ్మణమతాభిమాని ఋషభదత్తుని యొక్కయు, బౌద్ధమతాభిమానియగు గోతమీ పుత్రుని యొక్కయు దానశాసనములే వేనోళ్ళ జాటుచున్నవి.

వర్ణాశ్రమ ధర్మములు.

ఒక్క యార్యజాతి వారిచే మాత్రమే యీవర్ణాశ్రమ భేదములు గల్పించబడినవి గాని యనార్యులైన నాగులలోనూ మిశ్రమ జాతుల వారయిన బౌద్ధులలోనూ గల్పింపబడి యుండలేదు. ఆర్యులలో నైన ఇప్పటి రీతి వర్ణభేదములు గానరావు. ఆకాలమునందు వృత్తులను బట్టి కులభేదము లేర్పడినవిగాని కులభేదము బట్టి వృత్తులేర్పడి యుండలేదు. ఆకాలమునందు భోజన ప్రతిభోజనములకు ప్రతిబంధకము లేవియు నేర్పడి యుండలేదు. బ్రాహ్మణుడు చాతుర్వర్ణములలోని స్త్రీలను వివాహమాడడానికి నధికారము కలిగియుండెను. ఇట్టి అధికారము బ్రాహ్మణులు కలిగియుండుటకు గారణము లేక పోలేదు. ఆకాలమునందు బ్రాహ్మణులు దక్షిణాపథమున మిక్కిలి తక్కువ సంఖ్య కలవారుగా నుండిరి. ఇతర జాతులలోని స్త్రీలను వివాహమాడకుండినచో వారి సంఘము మభివృద్ధి గాంచనేరదు. శీఘ్రకాలములోనే యంతరించి పోవచ్చును గనుక స్వరక్షణార్ధమై వారు బ్రాహ్మణేతరులు బ్రాహ్మణులగుటకు మార్గములేర్పరచి బ్రాహ్మణేతరజాతి కన్యలను వివాహముజేసి కొనుచుండిరి. అప్పటికింకా బ్రాహ్మణులు మాంసభక్షకులుగా యున్నందున శూద్రాదులు చేసిన వంటకమును భుజించుటకు సంకోచింపకుండిరి. కాని బౌద్ధమతాచార్యుల యొక్కయు, జైనమతాచార్యుల యొక్కయు బోధనల చేత ఆచరణ విధానముల చేతను, సంపర్కము చేతను ఆచరణ విధానముల చేతను బౌద్ధులును జైనులును పెక్కండ్రు మాంసభోజనమును విసర్జించిరి. వీరితోడి మతచర్చల చేతను, సంపర్కము చేతను తరువాత పితృకార్యములలో సహితము మాంసభోజనమును వర్జింపవలసిన వారయిరి. ఈ గౌరవము విశేషముగా జైనమతమునకు జెందవలసి యున్నది. అహింసయే పరమధర్మమని బుద్ధుడు బోధించినదానిని అశోకవర్ధనుడు ప్రకాశింపజేసెను. అశోకుని సందేశమును ఆంధ్రులు శిరసావహించిరి. వీరి ప్రేరణముల చేతను జైనబౌద్ధమతాచార్యుల బోధనలచేతను బ్రాహ్మణు లెల్ల