చుండిరి. రాజకీయ భాష ప్రాకృతము. వ్యవహారిక భాష మగధము. ప్రాచీన మహారాష్ట్రము, పైశాచి, అపభ్రంశము, మొదలగు ప్రాకృత భేదములు దేశభాషలుగా నుండినవి. ఆకాలమున వాడబడుచుండిన లిపి మౌర్యలిపిగా నుండెను. శాసనములన్నియు పాలి భాషలో నున్నవి. ప్రాచీన ద్రావిడభాషయె పైశాచి యనంబడుచుండెను. ఆర్యులు దీనిని పైశాచియని యపహాస్యము చేయుచుండిరి. అయినను ఆంధ్రరాజులీ భాషలో గ్రంథములను వ్రాసియు, వ్రాయించియు దేశభాషను ప్రోత్సాహపరచిరి. శాలివాహనుని మంత్రియగు గుణాఢ్యపండితుడీ భాషలోనే బృహత్కథను రచించెనని యిదివరకె తెలిపియుంటిమి. శర్వవర్మయను మరియొక మంత్రి కాతంత్ర వ్యాకరణము నా భాషలోనే రచించి శాలివాహనునకు జెప్పెను. హాలశాతవాహనుడు ప్రాచీన మహారాష్ట్ర భాషలో సప్తశతి యనుగ్రంథమును రచించియున్నాడు. వీనిని బట్టి యాంధ్రరాజుల పరిపాలనమున దేశభాషలు పోషించబడి వర్ధిల్లెనని యూహింపవచ్చును. ఈ పైశాచభాషలో నుండియే అరవము, తెలుగు, కన్నడము, మళయాళము, తులు మొదలగు భాషలు జనించినవి. అనేక భాషల సాంకర్యమె తెలుగు బాస కబ్బుట చేత దక్కిన పైశాచీ పుత్రికలకంటె భిన్నమైనదిగ గాన్పించు చున్నది.
శిల్పశాస్త్రము-చిత్రవిద్య.
ఆంధ్రరాజుల పరిపాలన కాలమున శిపశాస్త్రము చిత్ర విద్యలు మిగుల నభివృద్ధికి దేబడినవి. ఈ యాంధ్రరాజు లనేక చైత్యములను స్తూపములను, విహారములను, రాజభవనములను, నిర్మించినందున శిల్పులకు దమతమ విద్యానైపుణ్యములను జూపుటకు మంచియవకాశము కలిగెను. మందిరము లెట్లు నిర్మింప వలయునో విగ్రహము లెట్లు చెక్కవలయునో, చిత్రపటములెట్లు వ్రాయవలయునో తెలుపునట్టి శాస్త్రములనేకము లంతకు బూర్వమె బౌద్ధులచే వ్రాయబడి యున్నవి. అట్టి శిల్పశాస్త్రజ్ఞులలో నాగ్నజిత్తుడను వాడు ముఖ్యుడు. ప్రత్యేకశిలలతో బట్టబయలున గట్టబడక పర్వతములను