పుట:Andhrula Charitramu Part-1.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మూడవయుగమయిన నవీనయుగమునందు నరపతులయొక్కయు, నశ్వపతులయొక్కయు, ద్రావిడదేశమును బాలించిన తెలుగునాయకులయొక్కయు, ఇప్పటి జమీందారులపూర్వులయొక్కయు జరిత్రములు మొదలగునవి యుండును. ఈ కడపటి రెండు యుగముల చరిత్రములును వీలుననుసరించి యేర్పాటుచేసికొనబడును గావున నివియె స్థిరములయిన విభాగములుగా జదువరులు తలంపరాదు.

చరిత్ర సాధనములు

ఈ యాంధ్రదేశ చరిత్రమును వ్రాయుటలో నాకు సాధనభూతంబులగు గ్రంథములయొక్కయు, తద్గ్రంథకర్తలయొక్కయు నామములను ముఖ్యావశ్యకములయిన స్థానములం దెల్లను బేర్కొనియుంటిని. ఆ గ్రంథములనన్నిటిని ఆ గ్రంథకర్తల నందరిని మరల బేర్కొనుట యనావశ్యకమయినను నాకెక్కువ సహాయమును గలుగజేసిన వారినామములను వారి గ్రంథములను మాత్రము నిటబేర్కొనుచున్నాడను. హల్‌ట్‌జ్(Hultzsch), ఫర్యూసన్(Fergusson), బర్గెస్(Burgess) జనరల్ కన్నిహ్యామ్(General Cunningham), సి.కన్నిహ్యామ్(C.Cunningham), బూలర్(Bahler) విన్సెంట్ స్మిథ్(Vincent Smith), సర్ వాల్టర్ ఎలియాట్(Sir Walter Elliot), స్యూయల్(Sewell), బర్నెల్(Burnell), కర్నల్ మెకంజి(Colonal Mackengie), విల్‌ఫర్డు(Wilford), క్యాంబెల్(Campbell), సి.పి.బ్రౌన్ (C.P.Brown) కాల్డ్వెల్(Caldwell),విల్సన్(Wilson), టేలర్(Taylor),రాప్సాన్(Rapson) ఫ్లీట్(Fleet), ఫౌల్‌క్స్(Foulkes), థామస్(Thomas), ఓల్డెనబర్గు