పుట:Andhrula Charitramu Part-1.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాన్పించుటచేత నతడే గోతమిపుత్ర్త శాతకర్ణియని స్మిత్తుగారు చెప్పుచున్నారు. విలినాయకురుని పేరు పురాణములలో నుదాహరించిన యాంధ్రరాజుల నామములలో నెచ్చటను గానరాదు. ఈ విలినాయకురుడు గోతమిపుత్ర యజ్ఞశ్రీశాతకర్ణియొక్కయు, శ్రీ పులమాయి యొక్కయు ప్రతినిధియై "హిప్పోకురో" (కోల్హాపురము) మండలమును బాలించినవాడు. "బలియోకురోసు" హిప్పోకురోలో నున్నవాడని టాలెమీ యను చరిత్రకారుడు వ్రాసియున్నాడు. ఈ బలియోకురోనే విలినాయకురుడని డాక్టరు భాండార్కరు గారు చెప్పిన దానిని స్మిత్తుగారు సహా చరిత్రకారులెల్లరు నంగీకరించినారు. [1] పైఠన్ (ప్రతిష్ఠానము)లో నున్నవాడని టాలెమిచే బేర్కొనబడిన సిరోపోలిమియోసే (Siro Polimios) శ్రీ పులమాయిగా నుండెను. మఱియు నాకాలమున టియాస్తనీ (Tiasrenes)ననువాడు ఉజ్జయినిలో పాలనము సేయుచుండెనని చెప్పెను. ఈ టాలెమీ యను చరిత్రకారుడు క్రీ.శ.163వ సంవత్సరమున మరణమునొందెను. ఇతడు తన భూగోళమును 151వ సంవత్సరము తరువాత రచించెనని చెప్పుదురు. కాబట్టి టాలెమీ చెప్పిన బలియోకురోసు (Baleokuros)సిరోపోలిమియోసు తియాస్తనీసు మూవురును 151వ సంవత్సరమునకు బూర్వమువారయి యుండవలయును. ఈ బలియోకురోసు, సిరోపోలిమియోసు తండ్రియై తండ్రి హిప్పోకురోలోను తనయుడు పైఠణ్ లోను రాజ్యము చేయుచున్నవారని స్మిత్తుగారి వాదము నంగీకరించిన పక్షమున ప్రధాన రాజధానియగు ధాన్యకటకనగర మెవరిపాలు చేయవలసియుండునో బోధపడకనున్నది. సత్యమేమనగా గోతమిపుత్ర్త శాతకర్ణి ధాన్యకటకమునే రాజధానిగ జేసికొని పరిపాలించుచుండెను. వాని కాలమున బశ్చిమభాగమున పైఠణ్ (ప్రతిష్ఠానపురము) అనబడు పట్టణమునను హిప్పోకురో అని టాలెమీచే బిలువంబడిన పట్టణమునను రాజప్రతినిధులుగలరు. శాతకర్ణి కుమారుడు శ్రీపులమాయి ప్రతిష్ఠాన

  1. Dr.Bhandarkar's Early History of Dekhan ., pp.20, 21, 22, 23. The Indian Review, Vol.X., no.6. Dr.Bhandarkar's article, June 1909.