పురియందు రాజప్రతినిధిగనుండి మహరాష్ట్ర దేశమును బాలించుచుండెను. బలియోకురోసని టాలెమీచే బిలువంబడిన విలివాయకురుడు పులమాయి కాలమున దక్షిణమహారాష్ట్రముకు రాజప్రతినిధిగ హిప్పోకురోయనియెడి కోల్హాపురమునందుండి రాజ్యము సేయుచుండెను. టాలెమీచే బేర్కొనబడిన తియాస్తనీసు ఉజ్జయిని పాలించు చస్తనుడని భాండార్కరు, స్మిత్తు మొదలగు వారెల్లరునంగీకరించిరి.
శకరాజులు దండెత్తి వచ్చినప్పుడు స్వదేశస్థులలో గలిసిపోయిన విదేశస్థులు కొందఱు సమయము తటస్థమైనప్పుడు తమ స్వాతంత్ర్యమును ప్రకటింప వేచియుండి స్వదేశస్థులకు బురికొల్పుకొని రాజద్రోహము తలపకుండుటకై కాబోలు శాస్త్రీయముగా విధించిన సుంకములనుగూడ గోతమిపుత్ర్త శాతకర్ణి తీసివేసెనని నాసికలోని శాసనము చాటుచున్నది. ఈతడు సహపానుని జయించి వాని రాజ్యమును స్వాధీనముజేసికొన్న తరువాత నహపానుని నాణెముల మీదనే తన నామమునుగూడ ముద్రింపించెను. మహారాష్ట్ర దేశములో దొరకిన పదునాలుగువేల నహపానుని నాణెములలోను తొమ్మిదివేల నాణెములపైన వెనుకప్రక్కను "రాణ్ణోగోతమి పుతాస సిరిశాతకానీనో" అని గోతమిపుత్త్రర శాతకర్ణి పేరు ముద్రింపబడినవిగానున్నవి. ఇతడు క్రీ.శ.154వ ప్రాంతమున మరణమునొందియుండును.
వాసిష్ఠిపుత్ర శ్రీ పులమాయి.
ఇతడు గోతమిపుత్ర్త శాతకర్ణికిని వాసిష్ఠిరాణికిని జనించినవాడు. శాతకర్ణి ధాన్యకటమున బరిపాలనము సేయుచుండ నీతడు యువరాజుగను