పుట:Andhrula Charitramu Part-1.pdf/157

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


యుండియుందురు. ఈ కుంభీరకుడు గొప్పవాడయినను గాకపోయినను రాజుగా బేర్కొనబడియుండుటచేత నాంధ్రదేశమునంతయుగాని కొంతవఱకుగాని పరిపాలించుచున్న వాడనుట స్పష్టము. కాబట్టి యిట్టి రాజుల పేరులనేకములు పురాణ కర్తలకు దెలియకుండెననుట స్పష్టము. విన్సెంటు స్మిత్తు గారు శ్రీముఖుని మొదటివానిగా జెప్పుటకు బైన జర్చించిన విషయములన్నియు బాధించుచున్నవి. ఈ విషయమున స్మిత్తుగారు త్రొక్కినత్రోవ యనుసరింపదగినది కాదని మా యభిప్రాయము. ఈ పైనుడువబడిన శాతకర్ణి మిక్కిలి ప్రజ్ఞావంతుడును పరాక్రమవంతుడునగుటచేత నేబదియాఱు సంవత్సరములు నిరాఘాటముగ బరిపాలనము చేసియున్నవాడు.

ఆప్లవుడు.

(క్రీ.త. 16 మొదలు 28 వఱకు)

శాతకర్ణి తరువాత నీపేరు గన్పట్టుచున్నది కాని యీతని చారిత్రము దెలియరాదు. ఆపీతకుడని మత్స్యపురాణమును, ఇవిలకుడని విష్ణుపురాణమును, హివిలకుడని భాగవత పురాణమును పేర్కొనుచున్నవి. శాతకర్ణికిని వీనికి నడుమ లంబోదరుడను రాజు పేరు మత్స్యవిష్ణు భాగవత పురాణముల యందు గాన్పించుచున్నది.

కుంతలశాతకర్ణి.

ఈ రాజును మత్స్యపురాణము మాత్రము పేర్కొనియున్నది. వాత్స్యాయనుని కామసూత్రములలో కుంతల శాతకర్ణ శాతవాహనుడు మహాదేవియను మలయావతితోడి కామక్రీడలలో కత్తెరలజంటతో నామెను జంపెనని చెప్పబడియున్నది. ఒక ప్రతిలో మాత్రము మలయావతియని వ్రాయక గణికయని వ్రాయబడియుండెను. గణికయనగా వారకాంత. వారకాంత మహాదేవి కాబోదు. కుంతలశాతకర్ణి కారోపించెడు నీ విషయము కల్పితమైనదగును గాని సత్యమై యుండదు. ఈ కుంతల శాతకర్ణికి బూర్వమునందును తరువాత మేఘస్వా