పుట:Andhrula Charitramu Part-1.pdf/156

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


లోని యాంధ్రభృత్య వంశమునకు బూర్వులని కొన్ని గాథలనుబట్టి నిర్ధారణ చేసియుంటిమి. వీరిలో గడపట చెప్పిన శాతకర్ణియె ఖారవేలునకు దోడ్పడినవాడని మా యభిప్రాయము. పురాణములలో జెప్పబడిన యాంధ్రరాజులకు బూర్వమాంధ్ర రాజులనేకులాంధ్రదేశమును బాలించిరని మాకుగల పూర్ణ విశ్వాసమును భట్టిప్రోలు శాసనములుగూడ బలపఱచుచున్నవి.

కుంభీరకరాజు.

కృష్ణామండలములో భట్టిప్రోలను గ్రామముగలదు. అచ్చట బుద్ధునిస్తూపమొకటియున్నది. వానిలో బది శాసనములు గానుపించుచున్నవి. ఈ శాసనములలో నొక రాజుయొక్కయు, అనేక గోష్ఠులయొక్కయు, బౌద్ధభిక్షువులు యొక్కయు నామములు దెలుపబడియున్నవి. కుంభీరకుడను రాజొకడొక బౌద్ధసంఘమునకు నాయకుడుగానుండి బుద్ధాలయమునకు నొక యద్దముల పెట్టెను నొక ఱాతిపెట్టెను దానము చేసినట్లుగ నాఱవ శిలాశాసనమునందును కుంభీరకుడను రాజుయొక్క ప్రేరేపణ చేత బూజనీయుడగు అర్హదత్తునిచే తయారుచేయబడి చిత్రములు చెక్కబడిన బరణియొకటియు, పెట్టెయొకటియు దానము చేయబడినట్లుగ దొమ్మిదవ శిలాశాసనమునందును బేర్కొనబడియుండెను. [1] ఈ శాసనములోని లిపి యశోకుని శాసనములలోని లిపినిబోలి ప్రాచీనమైనదిగాగన్పట్టుచున్నది. వీనిలోనుదాహరింపబడిన కుంభీరకుడను రాజాప్రాంతమున బరిపాలనము చేయువాడై యుండవలయును. ఈ పేరు పురాణములలో గానరాదు. ఈ శాసనములను జక్కగా బరిశోధించిన డాక్టరు బూలరుగారు క్రీస్తు శకమునకు రెండు వందల యేండ్లకు బూర్వముననెగాని తరువాత వ్రాయబడియుండనని నొక్కి వక్కాణించుచున్నారు. కనుక నీ శాసనములలో నుదాహరింపబడిన రాజు కుంభీరకుడనువాడును గోష్ఠులవారును కుటుంబములవారును, బౌద్ధభిక్షువులును అశోకునికి గొంచెమీవలనో ఆవలనో

  1. Epigraphia Inica Vol.II, p.326-329. Bhattiprolu Inscriptions by Dr.G.Buhler. C.I.E.