పుట:Andhrula Charitramu Part-1.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తి, స్వాతి, స్కందస్వాతి, మృగేంద్రస్వాతికర్ణుడు, అను రాజులను మత్స్యపురాణము పేర్కొనుచున్నది. వీరిలో మేఘస్వాతిని మాత్రము విష్ణుభాగవత పురాణములు పేర్కొనుచున్నవి. ఈ రాజులను గూర్చిన శాసనములు గాని చరిత్రముగాని యేవియు గానరావు.

పులమావి.

(క్రీ. త.28 మొదలుకొని 52 వఱకు.)

వీని పేరును వాయు మత్స్య విష్ణు పురాణములు పేర్కొనుచున్నవిగాని భాగవత పురాణము మాత్రము అటమానుడని పేర్కొనుచున్నది. ఈతని చారిత్రమును దెలియదు. పులమావి పేరు మహారాష్ట్రాంధ్ర దేశములలోని కొన్ని శాసనములలో గంపట్టుచున్నదిగాని తరువాత నించుమించుగా నూఱేండ్లకు రాజ్యభారమును వహించి ప్రసిద్ధుడయిన పులమావి యొక్క పేరుగా గన్పట్టుచున్నది. ఈ మొదటి పులమావి చరిత్రమును దెలియరాదు. వీని తరువాత రాజ్యపాలనము చేసినది నెమికృష్ణుడని వాయుపురాణమును "గౌరికృష్ణుడు లేక నౌరికృష్ణుడు" అని మత్స్యపురాణమును, అరిష్ఠకర్మయని విష్ణుపురాణమును, అనిష్ఠకర్మహాలేయుండని భాగవత పురాణమును బేర్కొనుచున్నవి.

హాలశాతవాహనుడు.

(క్రీ. త. మొదలుకొని వఱకును.)

ఈ హాలుడను వాడు విక్రమాదిత్యుని వలెను, భోజమహారాజు వలెను, శ్రీకృష్ణదేవరాయని వలెను ప్రతాపముతోబాటు విద్యాసంపత్తియు బ్రకాశింప దనకీర్తిని భరతఖండము నాల్గుదెసల బఱపినవాడు. ఇతడు విద్వాంసుడగుటంజేసి కవులను పండితులను నాదరించుచువచ్చెను. దేశభాషల యందభిమానము గలిగి గ్రంథములను రచించుయు, రచింపజేసియు, దేశభాషాభివృద్ధి గావించినట్లు గంపట్టుచున్నది. ఇతడు యువరాజుగానుండి ప్రతిష్ఠాన పురముననున్న కాలమున బ్రాచీన మహారాష్ట్ర భాషలో సప్తసతియను నీతిశృంగార కావ్యమును రచించి వన్నెగాంచెను. తన హర్షచరిత్రమునందు బాణకవి