Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహాకవిని చూచి నమస్కరించి యా వృత్తాంతమునంతయు బ్రశ్నించి పుష్పదంతుని శాపము మొదలుకొని కథావతారమునంతయు భూతభాషలో జెప్పగా వాని వలన నంతయు దెలిసికొనియెను. గుణాఢ్యుని ప్రమథావతారమని శాతవాహనుడు తెలిసికొని వాని పాదములకు మ్రొక్కి హరముఖోద్గతమైన యా దివ్యకథనంతయు దనకు దయచేయుమని వేడికొనెను. అంతట గుణాఢ్యుడు "ఓ రాజా ఆఱు లక్షల గ్రంథమయిన యారుకథలను కాల్చివేసితిని; ఇది లక్ష గ్రంథము; ఆ కథలలో నిదియొక్కటియే మిగిలియున్నది; పుచ్చుకొమ్ము; నా శిష్యులు నీతోకూడా వచ్చి దానిని వివరించి చెప్పగలరు" అని చెప్పి రాజును వీడ్కొని యోగమహిమచేత దేహమును వదలి గుణాఢ్య పండితుడు శాపవిముక్తుడై తన దివ్యపదమును బొందెను. అట్లు గుణాఢ్యుడొసంగిన దానిని బృహత్కథయను పేరిటి యానరవాహన దత్తచరిత్రమును గ్రహించి రాజు తన పట్టణముచేరి గుణాఢ్యుని శిష్యులయిన గుణదేవ నందిదేవులను మణికనక వస్తువాహనాదులతో బూజించెను. ఆ శిష్యులతో గూడ యా కథను విభజించి యా భూతభాషలోనే కథావతారమును దెలుపుటకై యీ కథాపీఠమును రచియించెను. [1] ఈ బృహత్కథను సుబంధకవి వాసవదత్తలోను, బాణకవి కాదంబరిలోను, దండిమహాకవి కావ్యదర్శనము నందును బ్రశంసించియున్నారు. కాళిదాసు కూడ మేఘసందేశములో నిందలికథందడవియున్నాడు. మఱియు నాగానందప్రియదర్శికా రత్నావళీ ముద్రారాక్షసాది నాటకములకును, కాదంబర్యాధికథలకును, ఈ కథయె మూలముగానున్నది.

ఈ గాథయొక్క ప్రయోజనము.

కొండొక ప్రయోజనమాసించి కథాసరిత్సాగరమున దెలుపంబడి మనోహరముగా నుండిన పై గాథను సంగ్రహముగా దెలిపియుంటిమి. ఈ గాథ కాలనిర్ణయమున కెంతమాత్రమును దోడ్పడకున్నను ఆ కాలమునందలి ప్రజలమత

  1. కథా సరిత్సాగరము కథాపీఠ లంబకమును చూడుడు.